E-Paper
Advertisement

Eluru News: ఏలూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. అర్ధరాత్రి సీనియర్లు-జూనియర్ల మధ్య ఫైటింగ్

Eluru News: ఏలూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. అర్ధరాత్రి సీనియర్లు-జూనియర్ల మధ్య ఫైటింగ్
Advertisement

Eluru News: కారణాలు ఏమైనా కావచ్చు.. ఈ మధ్యకాలంలో ర్యాగింగ్ భూతం తీవ్ర రూపం దాల్చుతోంది. దీనిబారిన పడిన విద్యార్థులు చివరకు ఫైటింగ్‌కు దిగుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఏలూరు మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశం చేసి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలేం జరిగింది?

మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

Advertisement

ఏలూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపింది. హాస్టల్‌లో మూడో ఇయర్ విద్యార్థులు.. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారు. అంతేకాదు వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. కొన్నాళ్లుగా ఈ ఘటన జరుగుతున్నా, విద్యార్థులు ఈ విషయాన్ని బయటపెట్టకుండా మౌనం వ్యవహరించారు.

అయితే రోజురోజుకూ సీనియర్ల ఆగడాలు శృతి మించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీనియర్లు-జూనియర్ల మధ్య ఫైటింగ్‌కు దారి తీసింది. చివరకు 15 మంది సీనియర్లు తమను వేధిస్తున్నారని జూనియర్ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం అర్ధరాత్రి పోలీసులు హాస్టల్‌కు చేరుకుని విచారణ చేపట్టారు.

Advertisement

అర్ధరాత్రి సీనియర్లు-జూనియర్ల మధ్య ఫైటింగ్

సీనియర్లు చెప్పిన పనులు చేయకుంటే దాడులు చేస్తున్నారని వివరించారు. మరి పోలీసులు విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ఈ మధ్యకాలం మంగళగిరి ఎయిమ్స్‌లో ఈ తరహా వ్యవహారం చోటు చేసుకుంది.  దీంతో పలువురు విద్యార్థులను ఇంటికి పంపారు.  ఇప్పుడు ఏలూరు వంతైంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ:  సీఎం చంద్రబాబు రిలీఫ్, ఆ కేసు మూసివేత

 

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×