BigTV English

Samantha: సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ తెలుగు వాడే.. ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే?

Samantha: సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ తెలుగు వాడే.. ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే?

Samantha: ప్రముఖ హీరోయిన్ సమంత (Samantha ) గత కొన్ని రోజులుగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj nidimoru) తో చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తిరుపతి, శ్రీకాళహస్తిలో స్వామి వారిని దర్శించుకున్న ఈమె.. అక్కడ కూడా రాజ్ తో కనిపించి అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. దీనికి తోడు మొన్నటికి మొన్న విమానంలో రాజ్ భుజంపై తలవాల్చి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈమె.. నిన్నటికి నిన్న మరో ఫోటోతో అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.


పెళ్లి వార్తలకు ఆజ్యం పోసిన సమంత..

ఇదిలా ఉండగా.. తాజాగా అమెరికాలో జరిగిన ఒక ఈవెంట్ కి రాజ్ తో కలిసి వెళ్లిన ఈమె.. అక్కడ కొన్ని ఫోటోలు దిగి
ఇంస్టాగ్రామ్ వేదికగా ఆ ఫోటోలను షేర్ చేసింది. అందులో రాజ్ నిడిమోరు సమంత భుజంపై చేయి వేసుకోగా.. సమంత తన చేయిని రాజ్ నడుముపై వేసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను సమంత స్వయంగా షేర్ చేయడంతో ఇక వీరి మధ్య బంధం మరింత బలపడిందనే వార్తలు వినిపించాయి. అంతేకాదు ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో రాజ్ భార్యా శ్యామలి దే కూడా స్పందించింది.


సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ బ్యాక్ గ్రౌండ్..

ఇలా రోజురోజుకి సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ రాజ్ గురించి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. రాజ్ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అభిమానులు క్యూరియాసిటీ చూపిస్తున్నారు. ఇక ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయం ఆరా తీయగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు విషయంలోకి వెళ్తే.. రాజ్ నిడిమోరు తెలుగు వాడే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో జన్మించారు. చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ పూర్తి చేసి, అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లారు. అక్కడ ఉన్నప్పుడే సినిమాలపై ఆసక్తి మొదలైంది. చిన్నప్పటి నుంచి తనతో పాటు కలిసి చదువుకొని అమెరికాలో తనతో పాటు ఉద్యోగం చేస్తున్న డీకే (DK ) తో కలిసి ముందుగా ఒక షార్ట్ ఫిలిం చేశారు. ‘ఫ్లేవర్స్’ అనే ఇంగ్లీషు చిత్రాన్ని రూపొందించారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి బాలీవుడ్ ప్రయాణం మొదలుపెట్టారు.

ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే?

దిగ్గజ డైరెక్టర్స్ గా పిలిచే వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు రూపొందించారు. వీరిద్దరూ కలిసి తమ మూడవ చిత్రం ‘గో గోవా గాన్’ తో పేరు సంపాదించుకొని.. ‘షోర్ ఇన్ ది సిటీ’ తో అంతర్జాతీయంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక వెబ్ సిరీస్ లతో భారీ విజయాలను అందుకున్న వీరు ఇప్పుడు మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇకపోతే రాజ్ ఫేవరెట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). ఇక ఈయన ఆస్తుల విషయానికొస్తే.. తాజాగా అనుకున్న సమాచారం ప్రకారం సుమారుగా రూ.80 నుండి రూ.90 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. సొంతంగా D2R అనే నిర్మాణ సంస్థను తన మిత్రుడు డీకేతో కలిసి ప్రారంభించారు.

డైరెక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా..

ఈ నిర్మాణ సంస్థ కింద ‘ఫ్యామిలీ మెన్’, ‘గన్స్ అండ్ గులబ్స్’, ‘ సిటాడెల్’ తదితర వెబ్ సిరీస్ లతో పాటు కొన్ని చిత్రాలు కూడా నిర్మించారు. ఇకపోతే వీరు తెలుగులో నేరుగా పెద్ద చిత్రాలు చేయకపోయినా.. ‘సినిమా బండి’అనే ఓటీటీ మూవీని నిర్మించారు. అంతేకాదు నాని(Nani)తో కలిసి ‘ఢీ – ఫర్ దోపిడీ’ అనే ఒక ఫ్లాప్ చిత్రాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఇప్పుడు సమంత కారణంగా రాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు.

ALSO READ:Comedian Ali: ఆమె వల్లే నా మేనల్లుడు చనిపోయాడు.. ఆలీ కన్నీటి పర్యంతం!

Related News

KishkindhaPuri Trailer: దెయ్యంలా మారిన అనుపమ… థియేటర్‌లో మరి భయపడుతారా ?

Emraan Hashmi: ఓమీ.. టాలీవుడ్ లో బాగా వినిపించే పేరు అవుతుంది

Soubin Shahir: కూలీ నటుడికి హై కోర్టు బిగ్ షాక్… విదేశాలకు వెళ్లడానికి నో పర్మిషన్..

Pookie: ఛీఛీ.. ఇదెక్కడి దిక్కుమాలిన టైటిల్ రా.. కొంచెం కూడా సిగ్గు లేదా.. విజయ్ ఆంటోనీ

SSMB 29 Update : ఫ్రాంఛైజీగా జక్కన్న మూవీ… ఎన్ని వందల కోట్లు పెడుతున్నారో తెలుసా ?

Actor Vasista : 50 రూపాయల కోసం ఆ పని.. కన్నీళ్లు తెప్పిస్తున్న యాక్టర్ వశిష్ఠ రియల్ లైఫ్..

Big Stories

×