Comedian Ali: సీనియర్ కమెడియన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఆలీ (Ali). ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఇప్పుడు అడపాదడపా మాత్రమే సినిమాలలో నటిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా యంగ్ హీరో సుహాస్ (Suhas) నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాలో చాలా సంవత్సరాల తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో నటించి, మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా జూలై 11వ తేదీన విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అలీ ఎమోషనల్ కామెంట్లు చేశారు.
ఆ అమ్మాయి వల్లే నా మేనల్లుడు చనిపోయాడు – ఆలీ
ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను సుహాస్ కి మామయ్య క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాను అంటే గత 15 సంవత్సరాల క్రితం నాకు ఒక మేనల్లుడు ఉండేవాడు. మా అక్క చనిపోతే వాడిని చిన్నప్పటి నుండి నేనే పెంచాను. వాడు నా ముందే ఎదిగాడు. అల్లారు ముద్దుగా వాడిని నేను పెంచుకున్నాను. అయితే ఒక అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఆ అమ్మాయి నో చెప్పడంతో ఆ బాధ తట్టుకోలేక వాడు చనిపోయాడు. అప్పటినుంచి మా అమ్మ బాధపడుతూ.. ప్రతి రోజు ఏడుస్తూనే ఉంది. ఈ సినిమాలో క్యారెక్టర్ చెప్పాక.. నేను దానికి కనెక్ట్ అయిపోయాను. అందుకే వెంటనే ఈ క్యారెక్టర్ కి ఒప్పుకున్నాను. సినిమాలో సుహాస్ ని చూస్తున్నంత సేపు నాకు నా మేనల్లుడే గుర్తొచ్చాడు” అంటూ స్టేజ్ పైనే ఎమోషనల్ అయ్యారు అలీ. ఒకరకంగా చెప్పాలి అంటే.. ఆ అమ్మాయే నా మేనల్లుడు మరణానికి కారణమయ్యింది. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఆలీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆలీ సినిమా జీవితం..
ఆలీ సినిమా జీవిత విషయానికి వస్తే .. హాస్యనటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. టీవీ వ్యాఖ్యాతగా కూడా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. దాదాపు 1100కు పైగా చిత్రాలలో నటించారు. బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన ఈయన సీతాకోకచిలుక సినిమా ద్వారా భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇక ఆలీకి అకాడమీ ఆఫ్ యూనివర్సల్ వారు గౌరవ డాక్టరేట్ ను కూడా ప్రకటించారు. ఆలీ తన తండ్రి పేరు మీద మహమ్మద్ భాష చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈయన తమ్ముడు ఖయ్యూం కూడా తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు.
ఆలీ రాజకీయ జీవితం..
ఆలీ నటుడుగానే కాకుండా రాజకీయరంగం వైపు కూడా అడుగులు వేశారు. 1999లో మురళీమోహన్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం అందుకున్న ఈయన.. ఆ పార్టీ తరఫున.. ఎన్నికలలో ప్రచారం కూడా చేశాడు. 2019 మార్చి 11న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈయనకు.. 2022 అక్టోబర్ 27న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 2024 జూన్ 28న రాజకీయాలకు స్వస్థి పలికారు ఆలీ.
ALSO READ:Betting App Promotion: తెలుగు హీరోలకు బిగ్ షాక్.. మొత్తం 29 మంది సెలబ్రిటీలపై కేసులు!