E-Paper
Advertisement

Samantha: మరో కొత్త బ్రాండ్ ఆవిష్కరించిన సమంత.. జెడ్ స్పీడ్ లో దూసుకుపోతోందిగా!

Samantha: మరో కొత్త బ్రాండ్ ఆవిష్కరించిన సమంత.. జెడ్ స్పీడ్ లో దూసుకుపోతోందిగా!
Advertisement

Samantha:టాలీవుడ్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న సమంత (Samantha) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలలో నటిస్తూ బిజీగా మారే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఒకవైపు హీరోయిన్ గా రాణిస్తూనే.. మరొకవైపు “ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్” అనే నిర్మాణ సంస్థను స్థాపించి, పలు చిత్రాలతో నిర్మాతగా విజయం సాధించింది. అయితే ఇప్పుడు బిజినెస్ ఉమెన్ గా కూడా మంచి పేరు దక్కించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే సినిమా రంగంతో పాటు వ్యాపార ప్రపంచంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటోంది.

మరో సరికొత్త బ్రాండ్ స్థాపించిన సమంత..

అందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో దుస్తుల బ్రాండ్లను స్థాపించి , వ్యాపార పరంగా సక్సెస్ అందుకున్న ఈమె.. తాజాగా మరో బ్రాండ్ ను స్థాపించింది. ఈమె “మైల్ కలెక్టివ్” అనే ఒక కొత్త యాక్టివ్ వేర్ బ్రాండ్ ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ దుస్తులు తేలికపాటి, సౌకర్యవంతమైన ఫ్యాబ్రిక్ తో తయారై.. భారతీయుల శరీర ఆకృతులు అలాగే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటిని డిజైన్ చేస్తున్నట్లు సమంత తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ..” గత కొంతకాలంగా ఈ బ్రాండ్ ను రూపొందించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాను. ఈ ప్రయాణంలో ఎదురైన భయాలు, అనుమానాలను దాటి ముందుకు సాగాను. ఇక వ్యాపార రంగంలోకి రావడం సవాలుతో కూడినదే అయినా.. దానిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నాను” అంటూ సమంత చెప్పుకొచ్చింది.

బిజినెస్ ఉమెన్ గా గుర్తింపు పొందడమే లక్ష్యం..

Advertisement

ఇదిలా ఉండగా.. ఈమె దుస్తుల వ్యాపారంలో స్థాపించిన బ్రాండ్లలో ఇదేమి మొదటిది కాదు. ఇది వరకే ఫ్యాషన్ బ్రాండ్ “సాకీ” ని రూపొందించిన ఈమె.. దీనిని మరింత అప్డేట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తోంది. అలాగే “ట్రూలీ స్మా” అనే పేరుతో డిజిటల్ లేబుల్ ను కూడా నిర్వహిస్తున్నారు. అలాగే “సీక్రెట్ ఆల్కమిస్ట్” అనే వెల్నెస్ బ్రాండ్ లో పెట్టుబడులు పెట్టి ఆరోగ్యం , జీవనశైలి రంగాలలో కూడా తన ఉనికిని చాటుకుంటుంది సమంత. ఏది ఏమైనా ఒకవైపు హీరోయిన్ గానే కాకుండా ఇలా బిజినెస్ ఉమెన్ గా కూడా మంచి పేరు దక్కించుకుంటూ ఉండటంతో ఈమెపై పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సమంత సినిమాలు..

తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై శుభం అనే సినిమాను నిర్మించి, గత ఏడాది నిర్మాతగా అవతరించిన సమంత.. ఇప్పుడు తన నిర్మాణ సంస్థ ద్వారానే మా ఇంటి బంగారం అనే చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రంలో సమంత హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. ఈమె భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా నుండి చిన్న టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో సమంత లుక్ ఆకట్టుకోవడమే కాకుండా ఈమె యాక్షన్ పర్ఫామెన్స్ మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. ఇక భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం

Advertisement

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×