E-Paper
Advertisement

Steelbird Helmet: స్టీల్‌బర్డ్ నుంచి సరికొత్త హెల్మెట్.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Steelbird Helmet: స్టీల్‌బర్డ్ నుంచి సరికొత్త హెల్మెట్.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

Steelbird BaseX Smart Helmet: ఇండియన్ హెల్మెట్ తయారీ సంస్థ స్టీల్‌బర్డ్ హై టెక్ ఇండియా లిమిటెడ్ వినియోగదారులను ఆకట్టుకునే అద్భుతమైన హెల్మెట్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. మంచి ప్రొటెక్షన్ తో పాటు చక్కటి లుక్ తో ఆకట్టుకునేలా వీటిని తయారు చేస్తుంది. తాజాగా స్టీల్‌బర్డ్  కేవలం రూ. 5,999కే ఫైటర్ హెల్మెట్లతో బేస్ X స్మార్ట్ రైడింగ్ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఇది హ్యాండ్స్ ఫ్రీ కంట్రోల్, గూగుల్, సిరి సపోర్ట్, రైడ్ మోడ్‌లు, రియర్ లైట్లు, టైప్ సి ఛార్జింగ్, 48 గంటల వరకు ప్లేబ్యాక్‌ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

బేస్ X హెల్మెట్ ప్రత్యేకత ఏంటంటే?

బేస్ X హ్యాండ్స్ ఫ్రీ ఆపరేషన్‌ను అందిస్తుంది. మూడు సెకన్ల పాటు బటన్‌ను నొక్కి పట్టుకోవడం ద్వారా గూగుల్ అసిస్టెంట్, సిరిని యాక్టివేషన్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ సిస్టమ్‌ లో మ్యూజిక్ ప్లే బ్యాక్ కంట్రోల్, మాగ్నెటిక్ లాక్ ఆధారిత పవర్ మెకానిజం ఉన్నాయి. ఈ హెల్మెట్ బిగించినప్పుడు, తీసివేసినప్పుడు యూనిట్‌ను ఆన్ చేస్తుంది.

Advertisement

ఇక ఈ హెల్మెట్ లో మరిన్ని అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. గ్లైడ్, బీస్ట్, రిలాక్స్ లాంటి రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. రైడర్స్ వాతావరణానికి అనుకూలంగా ఉండే రైడింగ్ మోడ్స్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ హెల్మెట్ కస్టమైజ్ చేసిన కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అదే సమయంలో బ్యాక్ సైడ్ ఇండికేటర్ లైట్లు, టైప్-సి ఛార్జింగ్ ఫోర్ట్ ఉంది. ఈ హెల్మెట్ సిస్టమ్ ఒకే ఛార్జ్‌ పై 48 గంటల వరకు ప్లే బ్యాక్‌ ను అందిస్తుందని స్టీల్‌ బర్డ్ వెల్లడించింది. బేస్ X సిస్టమ్ స్టీల్‌ బర్డ్ ఫైటర్ హెల్మెట్‌లతో అందుబాటులో ఉంది.

స్టీల్‌బర్డ్ హెల్మెట్ కంపెనీ గురించి..

స్టీల్‌బర్డ్ అనేది ప్రముఖ ఇండియన్ హెల్మెట్ తయారీ కంపెనీ. ఇది 1964లో ప్రారంభం అయ్యింది. అద్భుతమైన హెల్మెట్లు, బైక్ యాక్సెసరీస్‌ తయారు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. రైడర్ల భద్రతతే లక్ష్యంగా సరికొత్త ప్రొడక్ట్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 1964లో సుభాష్ కపూర్ ఈ కంపెనీని స్థాపించారు. ఫుల్ ఫేస్, ఓపెన్ ఫేస్, ఫ్లిప్ అప్, మోటోక్రాస్ లాంటి హెల్మెట్స్ ను తయారు చేస్తుంది. వాటితో పాటు గ్లోవ్స్, జాకెట్స్, ఆటో యాక్సెసరీస్ ను కూడా అందిస్తుంది. ఇది ప్రపంచంలోనే నంబర్ 1 హెల్మెట్ బ్రాండ్‌ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో ఈ కంపెనీ ప్రొడక్ట్స్  అందుబాటులో ఉన్నాయి.

Advertisement

హిమాచల్ ప్రదేశ్,  ఉత్తర ప్రదేశ్ లో ఈ కంపెనీకి చెందిన తయారీ యూనిట్లు ఉన్నాయి  ఉన్నాయి. రైడర్ల భద్రతను మెరుగుపరచడం, నాణ్యమైన సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టింది.  స్టీల్‌ బర్డ్, రైడర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, నకిలీ హెల్మెట్లను కాకుండా ISI మార్క్ ఉన్న హెల్మెట్‌లను కొనుగోలు చేయాలని వినియోగదారులకు సూచిస్తోంది.

Read Also:  ఓలా అదిరిపోయే ఆఫర్.. ఆ స్కూటర్ పై ఏకంగా రూ. 50 వేలు తగ్గింపు!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×