పార్టీ ఫిరాయింపుల కేసులో విచారణ తుది దశకు చేరుకుంది.నేడు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టనున్నారు. ఇటీవల దానం నాగేందర్ నేరుగా విచారణకు హాజరుకాకుండా, తన తరఫు లాయర్‌ను పంపించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే విచారణకు రాకపోవడంతో స్పీకర్ ఎంక్వయిరీని వాయిదా వేసిన విషయం తెలిసిందే.తాజాగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం అనర్హతపై స్పీకర్ విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలాఉండగా, దానం, కడియంలపై వేటు పడనుందని టాక్ వినిపిస్తోంది.
సుప్రీంకోర్టు గడువు ముగుస్తుండటంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారంతా బీఆర్ఎస్‌లోనే ఉన్నట్టు అంగీకరించారని, వారి వాంగ్మూలం ఆధారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పిటిషనర్ల ఆరోపణలను ఆయన తోసిపుచ్చినట్టు పేర్కొన్నారు. చివరగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ అనర్హతపై విచారించి స్పీకర్ నేడు తుదినిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తున్నది. కాగా, వీరిద్దరూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటివరకు స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోలేదని గులాబీ నేతలు విమర్శలు మొదలెట్టారు.
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గులాబీ గుర్తుమీద గెలిచిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద తన కూతురు కడియం కావ్య ఎంపీగా పోటీచేశారు. ఆ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ కండువా వేసుకుని ప్రచారం సైతం నిర్వహంచారని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. అల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని గులాబీ నేతలు చెబుతున్నారు. కాగా, ఈ విషయంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది.
AP liquor scam: ఏపీ లిక్కర్ కేసులో భారీ తిమింగళం.. నేపాల్ సరిహద్దులో చిక్కాడు
ఫిరాయింపులకు పాల్పడిన 8 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సరైన ఆధారాలు లేక స్పీకర్ వారి మీద వేటు వేయలేదని తెలుస్తోంది. కాగా, కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో మాత్రం సాలిడ్ ఆధారాలు ఉన్నాయని, వాటిని స్పీకర్‌కు సమర్పించినట్టు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.ఇన్ని ఆధారాలు స్పీకర్ ఎదుట ఉన్నా ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో అని బీఆర్ఎస్ నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దానం, కడియంపై వేటు వేస్తే అది బీఆర్ఎస్ నేతలకు ప్లస్ కానుంది. ఆ రెండు స్థానాల్లో ఉపఎన్నికలు రానున్నాయి. ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే ఆ రెండు స్థానాల్లో సత్తా చాటాలని గులాబీ నేతలు చూస్తున్నారు. కాగా, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే వేచిచూడాల్సిందే.