Samyukta Menon:ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ (Samyuktha Menon) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. టాలీవుడ్ లేడీ లక్కీగా మారిపోయిన ఈమె.. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే లేడీ ఓరియంటెడ్ గా సంయుక్త నటిస్తున్న చిత్రం ‘ది బ్లాక్ గోల్డ్’. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె నటిస్తున్న ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక పవర్ఫుల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో సమంత ఒక ఫియర్ లెస్ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. ఆయుధాల కంటే న్యాయాన్ని నమ్మే మహిళ అనే ట్యాగ్ లైన్ తో ఈ పాత్రను పరిచయం చేశారు. ముఖ్యంగా పోస్టర్లో సంయుక్త లుక్ ఇంటెన్సివ్ గా ఉండడంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి.
ప్రముఖ డైరెక్టర్ యోగి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇకపోతే సంయుక్త మీనన్ నటిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తుండగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు. ఉమెన్స్ డే సందర్భంగా ఒక మహిళా ప్రధాన చిత్రానికి సంబంధించిన అప్డేట్ రావడంతో అందులో సంయుక్త పవర్ఫుల్ లుక్ చూసి అభిమానులు కూడా ఆమెకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఈమె.. గత కొంతకాలంగా విభిన్నమైన పాత్రలలో అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తోంది.
ALSO READ:Samuthirakani: విజయ్ పై సముద్రఖని ఘాటు వ్యాఖ్యలు.. ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదా అంటూ!
అందులో భాగంగానే గతంలో బింబిసారా, విరూపాక్ష వంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్న సంయుక్త.. ఇప్పుడు ఈ ప్రయోగాత్మక చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరి సంయుక్తకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. 2016లో పాప్ కార్న్ అనే మలయాళం చిత్రంతో హీరోయిన్గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. కన్నడ, తెలుగు, తమిళ్ భాష చిత్రాలలో నటించిన ఈమె.. పాలక్కాడ్ ప్రాంతానికి చెందింది. చిన్మయ విశ్వవిద్యాలయంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఈమె.. త్రిసూర్లో ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా అందుకుంది. 2016లో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె.. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది . ఆ తర్వాత మంచి విజయం అందుకున్న ఈమె 2022 లో గాలిపట 2 సినిమాతో కన్నడ సినీ రంగంలోకి కూడా ప్రవేశించింది. ఒకవైపు విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న స్లమ్ డాగ్ సినిమాలో నటిస్తున్న ఈమె.. స్వయంభు సినిమాలో కూడా నటిస్తోంది. ఈ ఏడాది నారీ నారీ నడుమ మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హిందీ, తమిళ్ , మలయాళం భాషల్లో ఒక్కో చిత్రంలో నటిస్తోంది.