E-Paper
Advertisement

Phone hacked signs:సైబర్ అటాక్.. మీ ఫోన్ హ్యాక్ అయ్యిందని చెప్పే 7 లక్షణాలు ఇవే

Phone hacked signs:సైబర్ అటాక్.. మీ ఫోన్ హ్యాక్ అయ్యిందని చెప్పే 7 లక్షణాలు ఇవే
Advertisement

Phone hacked signs: మీ స్మార్ట్‌ఫోన్ మీ మాట వినడం లేదా? సడన్‌గా హ్యాంగ్ అవుతూ, వేడెక్కుతోందా? అయితే జాగ్రత్త.. నేటి డిజిటల్ యుగంలో మన బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫోటోలు అన్నీ ఫోన్‌లోనే ఉంటున్నాయి. మీ ప్రమేయం లేకుండా బ్యాటరీ ఖాళీ అవుతున్నా.. వింత యాప్‌లు కనిపిస్తున్నా అది హ్యాకర్ల పనే కావచ్చు. డేటా స్పైక్స్, అనవసర పాప్-అప్స్ మీ ప్రైవసీకి ప్రమాద సంకేతాలు. ఈ హెచ్చరికలను ముందే గుర్తించి.. జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మన ఫోన్ హ్యాక్ అయిందని గుర్తించడం కొన్నిసార్లు కష్టం కావచ్చు. కానీ ఈ కింది మార్పులను గమనిస్తే మాత్రం ఈజీ..

 మీ ఫోన్‌ హ్యక్ అయిందని చెప్పే ‘రెడ్ ఫ్లాగ్స్’:
1. బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఫోన్ సెగలు గక్కుతోందా?
మీరు అసలు గేమ్‌లు ఆడకపోయినా, వీడియోలు చూడకపోయినా ఫోన్ వేడెక్కుతుందా? బ్యాటరీ పర్సంటేజ్ కళ్ళ ముందే తగ్గిపోతుందా? అయితే లోపల ‘మాల్వేర్’ గ్యాంగ్ పని మొదలుపెట్టిందని అర్థం. హ్యాకర్లు మీ డేటాను దొంగిలించి వాళ్ల సర్వర్‌కి పంపిస్తున్నప్పుడు ఫోన్ ప్రాసెసర్ ఓవర్‌టైమ్ డ్యూటీ చేస్తుంది. అందుకే ఆ వేడి.

Advertisement

2. మీ ఫోన్‌లోని ‘అతిథి’ యాప్‌లు!
మీరు డౌన్‌లోడ్ చేయని యాప్‌లు మీ స్క్రీన్ మీద దర్శనమిస్తున్నాయా? “అరే.. ఇది నేను ఎప్పుడు ఇన్స్టాల్ చేశాను?” అని మీకు డౌట్ వచ్చిందంటే.. అది హ్యాకర్ల పనే. అలాగే, మీ డేటా ప్యాక్ మీరు వాడకముందే ఖాళీ అయిపోతుంటే.. మీ ఇన్ఫర్మేషన్ బయటకు ‘లీక్’ అవుతోందని గమనించండి.

3. మీరు పంపని మెసేజ్‌లు.. మీకే తెలియని కాల్స్!
మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి “ఏంట్రా ఆ వింత లింకులు పంపిస్తున్నావ్?” అని అడుగుతున్నారా? మీ కాల్ లిస్ట్‌లో తెలియని నంబర్లు కనిపిస్తున్నాయా? అంటే హ్యాకర్ మీ ఫోన్‌కి ‘బాస్’ అయిపోయాడన్నమాట. మీ పేరు మీద వాళ్లు స్కామ్స్ మొదలుపెట్టే ప్రమాదం ఉంది.

Advertisement

4. అకౌంట్స్ ‘లాగ్ అవుట్’.. స్క్రీన్ మీద ‘పాప్-అప్స్’!
ఇన్‌స్టాగ్రామ్ లేదా ఈమెయిల్ వాడదామని ఓపెన్ చేస్తే.. ‘Session Expired’ అని వచ్చి లాగ్ అవుట్ అయిపోతుందా? పాస్‌వర్డ్ మారినట్లు మెసేజ్ వచ్చిందా? అయితే మీరు హ్యాకర్ల వలలో చిక్కుకున్నట్లే. పైగా ఫోన్ స్క్రీన్ మీద పిచ్చి పిచ్చి అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తున్నాయంటే ‘యాడ్‌వేర్’ మీ ఫోన్‌ను ఆక్రమించేసింది.

5. మీపై ఒక ‘కన్ను’ ఉంది!
మీరు కెమెరా వాడకపోయినా కెమెరా పక్కన గ్రీన్ లేదా ఆరెంజ్ లైట్ వెలుగుతోందా? మీరు మాట్లాడకపోయినా మైక్ ఆన్ అవుతోందా? జాగ్రత్త. ఎవరో ఎక్కడో కూర్చుని మిమ్మల్ని చూస్తున్నారు లేదా మీ మాటలు వింటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన హ్యాకింగ్ సంకేతం.

Also Read: సగం ధరకే సోనీ, శాంసంగ్ 55 ఇంచ్ స్మార్ట్‌టీవీలు.. అమెజాన్ స్పెషల్ సేల్‌‌లో బెస్ట్ డీల్స్

మరి సేఫ్ గా ఉండటం ఎలా?:
లింక్ కనిపిస్తే నొక్కేయకండి: “మీకు లాటరీ తగిలింది” అనే లింక్స్ క్లిక్ చేస్తే.. మీ అకౌంట్ ఖాళీ అవుతుంది.

యాప్స్ జాగ్రత్త: కేవలం ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచే యాప్స్ డౌన్లోడ్ చేయండి.

2FA మస్ట్: మీ అకౌంట్స్‌కి టూ-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయండి.. అది మీ ఫోన్‌కి సెక్యూరిటీ గార్డు లాంటిది.

రీసెట్ బటన్: పరిస్థితి చేయి దాటిపోతే.. వెంటనే డేటా బ్యాకప్ తీసుకుని ‘ఫ్యాక్టరీ రీసెట్’ చేసేయండి.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×