Akhanda 2 Event : బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ 2. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అసలు వీరి కాంబినేషన్ అంటేనే సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఇప్పటికీ విడుదలైన మూడు సినిమాల్లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అఖండ 2 సినిమా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సినిమాలో సంయుక్త మీనన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సంయుక్త గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సార్, భీమ్లా నాయక్ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంది. ఇక ప్రస్తుతం అఖండ 2 లో కూడా నటిస్తుండటం వలన ఈవెంట్ కి హాజరయ్యారు.
అఖండ సినిమాలో సంయుక్తమైన పాత్ర మధ్యలోనే చనిపోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆర్కియాలజిస్ట్ గా కనిపించనుంది సంయుక్త. ఆర్కియాలజిస్ట్ అంటే పురావస్తు శాస్త్రవేత్త. వీరు గతాన్ని, గతంలోని ప్రజల సంస్కృతులను, నాగరికతలను అధ్యయనం చేసే నిపుణులు. వారు పురాతన ప్రదేశాల నుండి వస్తువులు, శిథిలాలు మరియు ఇతర ఆధారాలను త్రవ్వితీసి, వాటిని విశ్లేషిస్తారు.
అయితే ఈ సినిమా సనాతన ధర్మం గురించి అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు విడుదలైన వీడియో కంటెంట్ కూడా అది ప్రూవ్ చేసింది. సంయుక్త ఈ ఈవెంట్లో మాట్లాడుతూ అఖండ సినిమా గురించి అద్భుతమైన విషయాలు రివీల్ చేశారు.
నాకు చిన్నప్పుడు నుంచి శివుడు అంటే భక్తి కాదు విపరీతమైన ప్రేమ. సార్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ధనుష్ గారు అఖండ సినిమా చూసొచ్చి చాలా గొప్పగా చెప్పారు. నేను కుంభమేళా కి వెళ్తున్న తరుణంలో అఖండ సినిమాలో చిన్న పాత్ర ఉంది అని నాకు ఫోన్ వచ్చింది.
బాలయ్య గారు మీతో పనిచేయడం అదృష్టం మీకు అంత ఎనర్జీ ఎలా వస్తుందో నాకు తెలియదు. సడన్ గా మీరు సినిమాలు గురించి మాట్లాడుతారు. మీ హిందూపురం కాన్సిస్టెన్సీ గురించి మాట్లాడుతారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి మాట్లాడుతారు. నన్ను కూడా ఒక ఈవెంట్ కి పంపించారు. మీ ఎనర్జీ టీ మొత్తానికి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా మీతో కలిసి పని చేయాలని ఉంది.
చాలాసార్లు మేము షూటింగ్ చేస్తున్నప్పుడు మీ గురించి కూడా మాట్లాడుకున్నాం అంటూ ప్రేక్షకులను ఉద్దేశించి చెప్పారు. మేం చూస్తున్నప్పుడు తమన్ ఈ సీన్ లేపుతాడు అని మీరు మాట్లాడుకుంటారు అని మాకు అర్థమైంది. మొత్తానికి టైం చాలా తక్కువగా ఉండటం వలన సంయుక్తమైన స్పీచ్ మధ్యలోనే కట్ చేయవలసి వచ్చింది. సినిమాలో పూర్తిగా కనిపించదు. ఇక స్పీచ్ కూడా మధ్యలో ఆపేయటం కొంచెం బాధాకరమైన విషయం.
Also Read: Akhanda2 Thaandavam Teaser : బాలయ్య అరాచకం, థియేటర్లో శవాలు లేవడం ఖాయం