E-Paper
Advertisement

Spirit Movie: స్పిరిట్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గట్టిగనే ప్లాన్ చేస్తున్న సందీప్ రెడ్డి!

Spirit Movie: స్పిరిట్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గట్టిగనే ప్లాన్ చేస్తున్న సందీప్ రెడ్డి!
Advertisement

Spirit Movie: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం స్పిరిట్(Spirit) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించారు .డిసెంబర్ చివరి వరకు ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా ప్రభాస్ కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సందీప్ రెడ్డి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అన్ని భాషల నుంచి టాప్ సెలబ్రిటీలను ఈ సినిమాలో భాగం చేయబోతున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ ను ఢీకొట్టబోతున్న డాన్ లీ ..

ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ నటి త్రిప్రి దిమ్రి నటించబోతున్న సంగతి తెలిసిందే. అలాగే వివేక్ ఓబెరాయ్, ప్రకాష్ రాజ్, డాన్ లీ వంటి తదితరులు ఈ సినిమాలో భాగం కాబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమాలో పలువురు స్టార్స్ నటించబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నటించబోతున్నారని తెలుస్తోంది. సందీప్ రెడ్డి ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ (Kajol)ను సంప్రదించి ఆమెకు కథ వివరించారట.

స్పిరిట్ సినిమాలో కాజోల్..

Advertisement

ఇలా సందీప్ రెడ్డి నేరేట్ చేసిన విధానానికి ఇంప్రెస్ అయిన కాజోల్ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుసగా స్టార్స్ అందరినీ కూడా సందీప్ రెడ్డి ఈ సినిమాలో భాగం చేస్తున్న నేపథ్యంలో స్పిరిట్ సినిమాని భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని స్పష్టమవుతుంది. ఇలా ఈ సినిమాకు సంబంధించి ఒక్కో వార్త బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ అభిమానుల కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

2027 లో విడుదల…

Advertisement

ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇలా పోలీస్ ఆఫీసర్ గాను అలాగే ఖైదీగా కూడా రెండు విభిన్న పాత్రలలో ప్రభాస్ కనిపించనున్నారని ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుంచి విడుదల చేసిన ఒక ఆడియో టీజర్ ద్వారా స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమా 2027వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్, టి సిరీస్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి భూషణ్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు . అర్జున్ రెడ్డి యానిమల్ వంటి సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్న సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమాతో ఎలాంటి హిట్ కొట్టబోతున్నారో తెలియాల్సి ఉంది.

Also Read: Jadav Payeng : ‘ ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ జాదవ్ పయెంగ్ కు ‘ సంకల్ప కిరణ్ పురస్కారం..

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×