బీఆర్‌ఎస్‌పై ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. దీక్ష దివస్ పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తోందని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండగా ఒక్క రోజు మాత్రమే దీక్ష దీవస్ నిర్వహించిన బీఆర్‌ఎస్.. ప్రభుత్వం నిందలు వేయడానికే ఇప్పుడు పది రోజులు చేపట్టిందని విమర్శించారు మంత్రి సీతక్క.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్రంగా మండిపడ్డారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి. కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందనే వ్యాఖ్యలు దారుణమన్నారు. ఏపీ సంక్షేమాన్నే కోరుకున్న తాము, పవన్ కళ్యాణ్ భేషరతుగా డిమాండ్ చేశారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నం జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక, సీఈఓ కన్నమ నాయుడు మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. జడ్పీ నిధులతో 424 పనులకు ప్రోసిడింగ్స్ ఇచ్చి మధ్యలో ఆపివేయడంపై ఛైర్‌పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేయగా, సభ్యులు సీఈఓ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న సీఈఓపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వారు ఫిర్యాదు చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడుపై హాట్ కామెంట్స్ చేశారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్. అచ్చెన్నాయుడు వృద్ధాప్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. ఆయన్ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నామినేషన్ల గందరగోళం నెలకొంది. ‘జీరో ఎకౌంట్’ సమర్పించని కారణంగా మొదటి రోజు వేసిన నామినేషన్లను అధికారులు రద్దు చేశారు. మొదటి రోజు జీరో అకౌంట్ లేకపోయినా నామినేషన్లు తీసుకున్న అధికారులు, రెండో రోజు హఠాత్తుగా నిబంధన మార్చారు.
విజయవాడలో రోడ్డు పోటు ఉన్న ప్లాట్లను కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు రైతులు. త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన రైతులు.. వాస్తు సరిగా లేని ప్లాట్లు తమకు వద్దని స్పష్టం చేశారు. దక్షిణం, పశ్చిమ నైరుతి, ఉత్తర వాయువ్యం, తూర్పు ఆగ్నేయం వంటి దిక్కుల వైపు వీధి పోటు వస్తే.. ఆ ప్లాట్లు తీసుకోబోమని తేల్చి చెప్పారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మొదటి దశ పంచాయతీ నామినేషన్లు చివరి దశకు చేరుకోగా, ఏకగ్రీవ ప్రయత్నాలు ఊపందుకున్నాయి. భూపాలపల్లి జిల్లా బాలయ్యపల్లి సర్పంచ్‌గా తిరుపతి యాదవ్ ఏకగ్రీవమయ్యారు. వరంగల్ జిల్లా కిష్టాపురం గ్రామస్తులు స్వచ్ఛంద సేవకుడు కొండం రంగారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనగామ జిల్లా మాన్ సింగ్ తండా సర్పంచ్‌గా కత్తుల కొమురయ్య ఏకగ్రీవమయ్యారు.
జగిత్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో గంటకు పైగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కంప్యూటర్లు ఆగిపోయి, కౌంటర్లు చీకటిలో మునిగిపోవడంతో సిబ్బంది ఫోన్ టార్చ్‌లైట్ల సాయంతో ఫైళ్లను పరిశీలించారు. సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్‌ల కోసం వచ్చిన ప్రజలు కూడా మొబైల్ టార్చ్‌లైట్ల ఆధారంగా పత్రాలు వెతుక్కోవాల్సి వచ్చింది.
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రదేశంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఎనిమిది మందిని పోచారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ రాజు వర్మ సిబ్బందితో కలిసి దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి కారు, బైక్‌లు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు వృద్ధాప్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ ఆరోపించారు. చురుకైన మంత్రిని నియమించాలని, అచ్చెం నాయుడిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, వైజాగ్ CII సదస్సుపై విమర్శలు చేస్తూ, పెట్టుబడుల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ప్రశ్నించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నామినేషన్ల విషయంలో గందరగోళం చెలరేగింది. మొదటి రోజు ‘జీరో అకౌంట్’ లేకుండానే నామినేషన్లు తీసుకున్న అధికారులు, రెండో రోజు నిబంధన మార్చారు. దీంతో మొదటి రోజు నామినేషన్లు రద్దయ్యాయి. అధికారుల తప్పిదం వల్ల సమయం వృథా అయిందని, నామినేషన్ల గడువును పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో అధికారుల తీరుపై ఎంపీ వర్గానికి చెందిన మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు నేలపై కూర్చుని నిరసన తెలిపారు. కౌన్సిల్ మీటింగ్‌కు అధికారులు గంట దాటినా హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు చైర్మన్. ప్రజా సమస్యలపై అధికారులు స్పందించడం లేదని వారు విమర్శించారు.
కూటమి అధికారంలోకి వచ్చాక రూ.3 కోట్ల సీఎం సహాయ నిధులు అందించామని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. వైసీపీ ఐదేళ్లలో ఏం చేసిందో అర్థం కావడం లేదన్నారు. పరిశ్రమలు రాష్ట్రం దాటాయని, వైసీపీ నేతలకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదన్నారు. రాజమండ్రిని ఎకనామిక్ హబ్‌గా మారుస్తామన్నారు. మాజీ ఎంపీ భరత్ రాజమండ్రిలో అధికారాన్ని పొందేందుకు బంగారు బిస్కెట్లు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
ఢిల్లీ వాయు కాలుష్యంపై పార్లమెంట్‌లో చర్చకు రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు మాజీ ఎంపీ వి.హెచ్... ఈ సమావేశాల్లో బీసీ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని కోరారు. బీసీ బిల్లు అమలు కోసం చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనికి అన్ని పార్టీలు, సంఘాలు (సీఎం రేవంత్ రెడ్డి సహా) మద్దతు పలకాలని, ఢిల్లీకి రావాలని విహెచ్ పిలుపునిచ్చారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహావీర్ తండా సర్పంచ్ పదవికి వేలం నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఎస్టీ మహిళకు రిజర్వ్ అయిన ఈ పదవిని, మహావీర్ తండాకు చెందిన ఓ మహిళ కుటుంబ సభ్యులు రూ. 5 లక్షల 60 వేలకు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని, ఎన్నికల సంఘం దీనిని నిరోధించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజధాని రైతుల సమస్యలపై సీఆర్డీఏ అధికారులతో త్రీ మెన్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించింది. సమావేశంలో రైతు కమిటీ సభ్యులతో పాటు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. రోడ్డు పోటు, వీధి పోటుపై చర్చించారు. రైతులు ప్లాట్స్ కేటాయించడంపై అభ్యంతరం తెలిపారు. వాస్తు సరిగా లేని ప్లాట్స్ తమకు వద్దని చెప్పారు.
ఎయిర్‌బస్ సంస్థ కీలక ప్రకటన చేసింది. తమ ఏ320 మోడల్ విమానాలపై రేడియేషన్ ప్రభావం పడుతుందని తెలిపింది. సుమారు 250 విమానాల్లోని ఫ్లైట్ డేటా కంట్రోల్‌కు అవసరమైన సంక్లిష్ట డేటా, తీవ్రమైన రేడియేషన్ వల్ల కరప్ట్ అయ్యే అవకాశం ఉందని వెల్లడించదింది.
దిత్వా తుఫాన్ ఎఫెక్ట్‌తో తమిళనాడు తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన ఈదురుగాలుల కారణంగా రామేశ్వరం జిల్లాలోని పంబన్ దీవి పరిసరాల్లో సముద్రం హోరెత్తుతోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఈ తుపాను శ్రీలంక, ఆగ్నేయ బెంగాల్ మీదుగా ఉత్తర నైరుతి దిశగా కదులుతోంది.
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం రద్దయిందంటూ వచ్చిన వార్తలను వారిద్దరూ ఖండించారు. ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ బయోలలో దిష్టి రక్ష ఎమోజీని చేర్చడం ద్వారా వదంతులకు చెక్ పెట్టారు. పెళ్లి పోస్టులు తొలగించడం, పలాశ్‌పై ఆరోపణల కారణంగా వచ్చిన మనస్పర్థల ప్రచారాన్ని ఈ చర్యతో వారు కొట్టిపారేశారు.
టీమిండియా మాజీ స్టార్ స్పీన్నర్ రవిచంద్రన్ ఆశ్విన్.. స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుమ్రా వన్డేలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. కీలకమైన టెస్టు మ్యాచ్‌లు ఉంటేనే ఆడాలని సూచించాడు. బుమ్రాకు సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడటం చాలా ఇష్టం కానీ.. వర్క్ లోడ్ వల్ల జస్‌ప్రీత్‌పై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు ఆశ్విన్.