E-Paper
Advertisement

Jadav Payeng : ‘ ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ జాదవ్ పయెంగ్ కు ‘ సంకల్ప కిరణ్ పురస్కారం..

Jadav Payeng : ‘ ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ జాదవ్ పయెంగ్ కు ‘ సంకల్ప కిరణ్ పురస్కారం..
Advertisement

Jadav Payeng: జాదవ్ పయెంగ్ ప్రకృతిని ఇష్టపడే వారికి ఈయన పేరు తెలియక మానదు. ప్రకృతిని ప్రేమించే ఈయనకు ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా (Forest Man Of India)అనే గౌరవం లభించింది .అలాగే పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు. తాజాగా జాదవ్ పయెంగ్ (Jadav Payeng)మరో పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు ఈయనకు “సంకల్ప కిరణ్”(Sankalpa Kiran) అనే పురస్కారం లభించింది. సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం హైటెక్ సిటీ శిల్పారామం లోని మౌంటెన్ హైట్స్ లో “సంకల్ప దివాస్” కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యాపారవేత్త లయన్ డాక్టర్ వై కిరణ్ (Dr.Y kiran)తన పుట్టిన రోజున పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ వేడుకను నిర్వహిస్తారు .

సంకల్ప కిరణ్ పురస్కారం..

ఈ కార్యక్రమంలో భాగంగా లయన్ డాక్టర్ వై కిరణ్ సమాజ సేవ చేయడంతో పాటు సమాజానికి సేవ చేస్తున్న ప్రముఖులను గుర్తించి వారిని పురస్కరిస్తూ ఉంటారు. గత 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతూ వస్తోంది .అయితే తాజాగా సంకల్ప దివాస్ కార్యక్రమంలో భాగంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యఅతథిగా పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులమీదుగా
జాదవ్ పయెంగ్ కి సంకల్ప కిరణ్ పురస్కారాన్ని అందజేశారు.జాదవ్ పయెంగ్ ప్రకృతి ప్రేమికుడు, జీవరాశి మనుగడ కోసం గత 42 సంవత్సరాలుగా మొక్కలను నాటుతూ వందలాది ఎకరాలను అటవీ ప్రాంతంగా మార్చారు దీంతో ఆయనను ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా గౌరవించబడింది.

రోజు ఒక మొక్క నాటడమే లక్ష్యం…

Advertisement

ఈయన సేవలను గుర్తించిన సుచిరిండియా ఫౌండేషన్ సంకల్ప కిరణ్ పురస్కారంతో సత్కరించింది. 1979లో మొదలైన ఆయన సేవలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకు ఒక మొక్క నాటడం లక్ష్యంతో ముందుకు సాగిన ఆయన ఆలోచన నేడు 550 హెక్టార్లకు పైగా అడవిని సృష్టించింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయనకు ఏ అవార్డును అందించడం పట్ల లయన్ డాక్టర్ వై కిరణ్ మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు.జాదవ్ పయెంగ్ సత్కరించడం కోసమే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు వచ్చారని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తికి సంకల్ప కిరణ్ పురస్కారాన్ని అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న గొప్ప కార్యక్రమాల గురించి కూడా కిరణ్ వెల్లడించారు.

అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది..

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సంకల్ప కిరణ్ అవార్డును అందుకున్న పద్మశ్రీ జాదవ్ పయెంగ్ మాట్లాడుతూ.. ఈ పురస్కారం అందుకోవడం తనకు చాలా గౌరవంగా ఉందని తెలిపారు. కిరణ్ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన చేసే సేవా కార్యక్రమాలు గురించి వింటున్నాను అలాంటి వ్యక్తితో వేదిక పంచుకోవడమే చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తాను కిరణ్ గారిని కలవక ముందే తన గురించి చాలా గొప్పగా విన్నానని జాదవ్ పయెంగ్ ఈ సందర్భంగా తనకు ఈ అవార్డును పురస్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సామాజిక కార్యకర్త నవాబ్స్ కిచెన్ సి ప్రవీణ్ కుమార్ యాదవ్ అలాగే పోలిన చంద్రశేఖర్ వంటి తదితరులను కూడా సత్కరించారు.

Also Read: Varanasi Title: వారణాసి టైటిల్ వివాదానికి తెర పడినట్లే..తెలుగులో చిన్న మార్పు?

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×