Sandeep Reddy vanga: సందీప్ రెడ్డి పరిచయం అవసరం లేని పేరు. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈయన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తరువాత సందీప్ రెడ్డి ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేశారు. అక్కడ కూడా సూపర్ సక్సెస్ కావడంతో ఈయన ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా తర్వాత యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి(Sandeep Reddy) ఏకంగా ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఈయన ప్రభాస్ హీరోగా స్పిరిట్(Spirit) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నప్పటికీ సందీప్ రెడ్డి తదుపరి సినిమాల గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
సందీప్ రెడ్డి తన తదుపరి సినిమా అల్లు అర్జున్ తో ఉండబోతుందని నిర్మాత భూషణ్ కుమార్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక అల్లు అర్జున్ తో మాత్రమే కాకుండా మహేష్ బాబు(Mahesh Babu)తో కూడా సందీప్ రెడ్డి సినిమా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై సందీప్ రెడ్డికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇది పాత వీడియో అయినప్పటికీ ఈయన మహేష్ బాబు సినిమా గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబుతో కచ్చితంగా తన సినిమా ఉంటుందని సందీప్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
మహేష్ బాబుతో కచ్చితంగా నా సినిమా ఉంటుందని అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ ఈ సినిమా కోసం మాత్రం తాను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. అయితే మహేష్ బాబుకి గతంలో సినిమా స్టోరీ కూడా చెప్పానని, ఫాదర్ సన్ ఎమోషనల్ డ్రామాగా ఉన్న స్టోరీ నేరేట్ చేశానని సందీప్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ విన్న మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ రాజమౌళి తర్వాత మహేష్ బాబుతో సందీప్ రెడ్డి సినిమా చేస్తే బాగుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వారణాసి పనులలో బిజీగా మహేష్..
మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు రాబోతుందో వేచి చూడాలి. ప్రస్తుతం సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత యానిమల్ సీక్వెల్ సినిమా పనులలో బిజీ కానున్నారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డి సినిమా ఉంటుంది. ఈ సినిమాలన్నీ పూర్తి అయిన తరువాతనే మహేష్ బాబుతో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు కూడా ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: Sravanthi Chokarapu: రూ.20 కోట్ల విలువైన విల్లా కట్టిన యాంకర్ స్రవంతి… హీరోయిన్లు కూడా వేస్టేగా?