E-Paper
Advertisement

Australia: ఆస్ట్రేలియాకు మ‌రో చావుదెబ్బ‌..ఒలింపిక్స్ లో స్థానం గ‌ల్లంతు..!

Australia: ఆస్ట్రేలియాకు మ‌రో చావుదెబ్బ‌..ఒలింపిక్స్ లో స్థానం గ‌ల్లంతు..!
Advertisement

Australia:  టీ20 ప్రపంచ కప్ 2026 టోర్న‌మెంట్ ( ( T20 World Cup 2026 tournament)) నేప‌థ్యంలో ఎలిమినేట్ అయిన ఆస్ట్రేలియా జ‌ట్టుకు మ‌రో షాక్ త‌గిలింది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియా స్థానం గ‌ల్లంతు అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్న‌మెంట్ గ్రూప్ స్టేజ్ లో ఆస్ట్రేలియా ( Australia) ఎలిమినేట్ అయిన ఈ ప‌రిస్థితి నెల‌కొంది. అయితే, ఆస్ట్రేలియా స్థానంలో న్యూజిలాండ్ 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో ( 2028 LA Olympics) ప్లేస్ ఖ‌రారు చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. సూప‌ర్ 8 లోకి న్యూజిలాండ్ వెళ్లిన నేప‌థ్యంలో ఆస్ట్రేలియా స్థానం ఒలింపిక్స్ లో స్థానం గ‌ల్లంతు అయింది.

Also Read: ZIM qualified into super 8: కొంపముంచిన వ‌రుణుడు, ప్ర‌పంచ క‌ప్ నుంచి నిష్క్ర‌మించిన‌ ఆస్ట్రేలియా..సూప‌ర్ 8 కు జింబాబ్వే

ఆస్ట్రేలియాకు మ‌రో చావుదెబ్బ‌..ఒలింపిక్స్ లో స్థానం గ‌ల్లంతు..!

Advertisement

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్నమెంట్ నేప‌థ్యంలో ఆస్ట్రేలియా అత్యంత దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌నబ‌రిచింది. గ్రూప్ స్టేజ్ లోనే ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయింది. జింబాబ్వే చేతిలో మొద‌ట ఓడిన ఆస్ట్రేలియా, ఆ త‌ర్వాత శ్రీలంక చేతిలో కూడా ఓడింది. దీంతో టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్నమెంట్ పాయింట్ల ప‌ట్టిక‌లో కేవ‌లం ఆస్ట్రేలియాకు 2 పాయింట్లు ద‌క్కాయి. దీంతో గ్రూప్ బీలో 4వ స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది. ఇక అటు పాయింట్ల పట్టిక‌లో ఆస్ట్రేలియా కంటే ఎక్కు వ పాయింట్లు సాధించిన జింబాబ్వే సూప‌ర్ 8 లోకి దూసుకెళ్లింది. దీంతో ఈ గ్రూప్ బీలో ఉన్న శ్రీలంక, జింబాబ్వే రెండు జ‌ట్లు కూడా సూప‌ర్ 8 లోకి దూసుకెళ్లింది.

2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ నుంచి ఆస్ట్రేలియాను ఎందుకు ప‌క్క‌కు పెట్టారంటే ?

2028లో జరిగే లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్ లో ( Los Angeles) అర్హత సాధించాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ సారి ఈ ఒలంపిక్స్ లో క్రికెట్ కూడా ప్రవేశపెడుతున్నారు. ప్రతి ఖండం నుంచి ఒక ర్యాంకింగ్స్ లో అగ్రశ్రేణిగా ఉన్న జట్టును ఈ లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్ లోకి తీసుకోనున్నారు. సదరు జట్టు కచ్చితంగా ర్యాంకింగ్స్ లో అగ్రశ్రేణిగా ఉండడమే కాకుండా అద్భుతంగా రాణించాలి. ఇందులో భాగంగానే ఓసియానియా ప్రాంతం నుంచి ఆస్ట్రేలియాకు మొన్నటి వరకు ఛాన్స్ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి గ్రూప్ దశలో ఎలిమినేట్ అయింది ఆస్ట్రేలియా.

Advertisement

ఇదే ప్రాంతం నుంచి వచ్చిన న్యూజిలాండ్ మాత్రం సూపర్ 8 లోకి దూసుకు వెళ్ళింది. ఈ స్టేజ్ లో న్యూజిలాండ్ అద్భుతంగా రాణించి సెమీ ఫైనల్ దాకా వెళ్తే , ర్యాంకింగ్ ప్రకారం మరింత బలపడుతుంది. అప్పుడు ఆస్ట్రేలియాను ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ వెనక్కి నెట్టే అవకాశాలు ఉంటాయి. ఇదే జరిగితే 2028 లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్ కు ఆస్ట్రేలియా స్థానంలో న్యూజిలాండ్ క్వాలిఫై అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిన ఆస్ట్రేలియా కు.. ఒలంపిక్స్ రూపంలో మరో షాక్ ఎదురైందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

 

 

Also Read: Sourav Ganguly: 85 శాతం కంటి చూపు కోల్ప‌యిన పాకిస్తాన్ క్రికెట‌ర్‌..రంగంలోకి టీమిండియా ప్లేయ‌ర్లు, 14 మంది సంచ‌ల‌న లేఖ‌

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×