The Paradise : సుకుమార్ దగ్గర నుంచి వచ్చిన చాలామంది శిష్యులు ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకులుగా ప్రూవ్ చేసుకుంటున్నారు. సుకుమార్ చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. దాదాపు 100 కోట్లకు పైగా ఆ సినిమా కలెక్షన్స్ వసూలు చేసింది.
అలాగే సుకుమార్ మరో శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు. నాని నటించిన ఆ సినిమా తన కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది. గతంలో నాని ఇప్పుడు చూడని విధంగా ఆ సినిమాలో కనిపించడు. దర్శకుడుగా 100% శ్రీకాంత్ సక్సెస్ అయిపోయాడు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల పారడైజ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను మార్చి 26 2026 లో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే మధ్యలో కొంతమంది సినిమా కార్మికులు సమ్మె చేయటం. అనుకున్న టైములో షెడ్యూల్స్ అవ్వకపోవడం వలన ఈ సినిమా డిలే అవుతుంది అని చాలామంది ఊహించరు.
సినిమా రిలీజ్ డేట్ కి రావట్లేదు అని కొంతమంది కథనాలు కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎట్టి పరిస్థితులను మార్చి 26 2026 లో ఈ సినిమా విడుదల చేయడానికి సిద్ధం చేస్తుంది చిత్ర యూనిట్.
ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నారు. చిత్ర యూనిట్ అంతా కూడా కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోతూ రెస్ట్లెస్ గా పనిచేస్తూ ఈ సినిమాను పూర్తిచేసే ఆలోచనలో ఉన్నారు. వీళ్ళు డెడికేషన్ చూస్తుంటే ఖచ్చితంగా అద్భుతమైన సక్సెస్ కొడతారు అని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమాల్లో కలెక్షన్ కింగ్ మంచి మోహన్ బాబు విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. విలన్ గా తన కెరీర్ మొదలు పెట్టిన మోహన్ బాబు మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించారు మోహన్ బాబు.
తాను హీరోగా చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ కావు కానీ వేరే సినిమాలో మోహన్ బాబు ఒక కీలకపాత్రలో కనిపిస్తున్నారు అంటే ఒక రకమైన క్యూరియాసిటీ ఉండటం అనేది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు పారడైజ్ సినిమా మీద అటువంటి అంచనాలు ఉన్నాయి.
Also Read: Vanga Chats NAG : సందీప్ రెడ్డి వంగా అంటే రాంగోపాల్ వర్మ కి బాప్