E-Paper
Advertisement

Prabhas:స్పిరిట్ విషయంలో ప్రభాస్‌కు సందీప్ మరో కండీషన్… డార్లింగ్ కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైం

Prabhas:స్పిరిట్ విషయంలో ప్రభాస్‌కు సందీప్ మరో కండీషన్… డార్లింగ్ కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైం
Advertisement

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం ది రాజా సాబ్ (The Raja Saab)సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హర్రర్ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ పాటు ఈ సినిమాలో నటించిన ముగ్గురు హీరోయిన్లు కలిసి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వీడియో విడుదల చేశారు.

మొదటి రోజు సినిమా చూడరా?

ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ సినిమాల గురించి ప్రస్తావనకు వచ్చింది. సాధారణంగా ఒక హీరో నటించిన సినిమా విడుదల అయింది అంటే మొదటి రోజే థియేటర్ కు వెళ్లి ఆ హీరో సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు కూడా మొదటి రోజే తన సినిమాను థియేటర్లో చూడలేదని తెలుస్తోంది. సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత ఈయన థియేటర్లో సినిమాని చూస్తారట ఈ విషయాన్ని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

సందీప్ రెడ్డికి ప్రామిస్ చేసిన ప్రభాస్..

Advertisement

తాను ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా మొదటి రోజు వెళ్లి థియేటర్లో సినిమా చూడలేదని చెప్పగానే సందీప్ రెడ్డి ఆశ్చర్యపోయారు. కానీ స్పిరిట్ సినిమా విషయంలో ఇలా జరగడానికి వీలులేదని, ఫస్ట్ రోజే థియేటర్లో సినిమా చూడాలి అంటూ సందీప్ రెడ్డి ప్రభాస్ కు మరో కండిషన్ పెట్టారు. అందుకు ప్రభాస్ కూడా ఓకే చెప్పారు. ఈ సినిమా స్టార్టింగ్ సమయంలోనే మొదటి రోజే థియేటర్ లో స్పిరిట్ సినిమా చూడాలని సందీప్ రెడ్డి కోరడంతో ప్రభాస్ ప్రామిస్ చేసినట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటివరకు స్పిరిట్ విషయంలో సందీప్ రెడ్డి ప్రభాస్ కు ఎన్నో కండిషన్లు పెట్టినట్టు తెలుస్తుంది. ఇక తాజాగా ఫస్ట్ డేనే ఈ సినిమాని చూడాలని కండిషన్ కూడా పెట్టారని తెలిసి అభిమానులు కాస్త ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు డార్లింగ్ ఒక్క సినిమాని కూడా ఫస్ట్ రోజు చూడలేదా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

2027 సంక్రాంతి రిలీజ్?

Advertisement

ఇక స్పిరిట్ సినిమా విషయానికి వస్తే ప్రభాస్ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఎనిమిది భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. టీ సిరీస్ బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ చివరివారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాని 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్టు సమాచారం.

Also Read: Prabhas On Spirit poster: స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ప్రభాస్ రియాక్షన్.. ది బెస్ట్ అంటూ

 

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×