E-Paper
Advertisement

Karnataka Crime: డబ్బుల కోసం ఆ తండ్రి.. కన్న కూతుర్ని అందులోకి దింపి, ఏకంగా 10 మంది అత్యాచారం

Karnataka Crime: డబ్బుల కోసం ఆ తండ్రి.. కన్న కూతుర్ని అందులోకి దింపి, ఏకంగా 10 మంది అత్యాచారం
Advertisement

Karnataka Crime: ఏదైనా తల్లిదండ్రులు ఉంటేనే పిల్లల భవిష్యత్ బాగుంటుంది. ఏ ఒక్కరు లేకపోయినా ఆ పిల్లల భవిష్యత్ అగమ్య గోచరంగా ఉంటుంది. అందుకు ఎగ్జాంఫుల్ ఈ ఘటన. డబ్బుల కోసం కూతుర్ని వ్యభివార రొంపిలోకి దింపాడు తండ్రి. ఏకంగా 10 మంది టీనేజ్ యువతిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది.

చిక్క‌మ‌గ‌ళూరు జిల్లా దారుణం

Advertisement

క‌ర్ణాట‌క‌లోని చిక్క‌మ‌గ‌ళూరు జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. బిరూర్ ప్రాంతానికి చెందిన టీనేజ్ యువతి ఇంటర్ పూర్తి చేసింది.  రెండేళ్ల కిందట యువతి తల్లి చనిపోయింది. అమ్మ‌మ్మ దగ్గర ఉంటూ ఇంటర్ పూర్తి చేసింది. అనంతరం తిరిగి త‌న తండ్రి వ‌ద్ద‌కు వెళ్లింది. తను ప్రేమ‌గా చూసుకుంటాడ‌ని భావించింది. కానీ ఆ తండ్రి డబ్బులకు ఆశపడ్డాడు. చివరకు వ్య‌భిచార రొంపిలోకి దించేశాడు.

డిసెంబర్‌లో కూతుర్ని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లాడు తండ్రి. వారం రోజులు తర్వాత అమ్మమ్మ-తండ్రి కలిసి కూతుర్ని అమ్మేయడానికి ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో భరత్ శెట్టి అనే వ్యక్తి వచ్చి ఆ తండ్రికి డబ్బు ఆశచూపించి ప్రలోభపెట్టాడు. కూతుర్ని వ్యభిచారం రొంపిలోకి దింపితే రోజుకు ఐదు వేలు సంపాదించవచ్చని కన్వీన్స్ చేశాడు.

Advertisement

కూతుర్ని వ్యభిచారంలోకి దింపిన తండ్రి

డబ్బులకు కక్కుర్తిపడిన కన్న తండ్రి. చివరకు కూతుర్ని తీసుకొని తండ్రి.. భ‌ర‌త్ శెట్టి కలిసి ప్ర‌త్యేక వాహ‌నంలో మంగ‌ళూరుకు బ‌య‌లుదేరారు. మార్గ‌మ‌ధ్య‌లో యువతిపై కామాంధులు విరుచుకుప‌డ్డాయి. న‌లుగురు వ్య‌క్తులు యువతిపై అత్యాచారం చేశారు. నెల‌స‌రి అని చెప్పినా మృగాల మాదిరి యువతిపై విరుచుప‌డ్డారు.

రెండురోజులపాటు బాలికను గదిలో బంధించి ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. భ‌ర‌త్ శెట్టి నుంచి త‌ప్పించుకున్న బాధిత యువతి, బీరూర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు, ద‌ర్యాప్తు చేప‌ట్టారు. తండ్రి-అమ్మమ్మతోపాటు మొత్తం డజను మందిని అరెస్టు చేశారు. భరత్ శెట్టి గురించి ఆరా తీశారు పోలీసులు.

ALSO READ: ప్రియుడు వేధించాడని వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

అతడు దక్షిణ కన్నడ జిల్లాలో వ్యభిచార ముఠాను నడుపుతున్నాడని తేలింది. భరత్‌పై మంగళూరు, ఉడిపి ప్రాంతాల్లో దాదాపు ఎనిమిదికి పైగా వ్యభిచార కేసులు నమోదయ్యాయి. ఈ నెట్‌వర్క్‌తో సంబంధమున్న వ్యక్తుల కోసం దాడులు చేపట్టారు పోలీసులు. దీంతో తీగలాగితే భరత్‌శెట్టి డొంక కదులుతోంది. ఈ కేసులో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులకి వస్తాయో చూడాలి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×