E-Paper
Advertisement

Prabhas On Spirit poster: స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ప్రభాస్ రియాక్షన్.. ది బెస్ట్ అంటూ

Prabhas On Spirit poster: స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ప్రభాస్ రియాక్షన్.. ది బెస్ట్ అంటూ
Advertisement

Prabhas On Spirit poster: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ తాజాగా నటించిన ది రాజా సాబ్ (The Raja Saab)సినిమా జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మరికొన్ని గంటలలో ఈ సినిమా ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్లను నిర్వహిస్తూ ఉన్నారు. తాజాగా సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy )తో రాజా సాబ్ టీం ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇటీవల ప్రోమో విడుదల చేయగా, తాజాగా పూర్తి ఇంటర్వ్యూను రిలీజ్ చేశారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా స్పిరిట్ సినిమా(Spirit Movie) గురించి ప్రస్తావనకు వచ్చింది.

స్పిరిట్ ఫస్ట్ లుక్ ది బెస్ట్..

సందీప్ రెడ్డి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ కు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ అందరిని ఆకట్టుకుంది. చేతిలో మందు బాటిల్ నోటిలో సిగరెట్ ఒంటి నిండా గాయాలతో ఉన్న ఈ పోస్టర్ సినిమా పట్ల అంచనాలను పెంచేసింది. ఈ పోస్టర్ గురించి ప్రస్తావనకు రావడంతో సందీప్ రెడ్డి  ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బాహుబలి తర్వాత అంత రేంజ్ లో ప్రభాస్ ని ఎలా చూపించాలి అనుకున్నాను అందుకే స్పిరిట్ ఫస్ట్ లుక్ విడుదల చేశాను అని సందీప్ రెడ్డి చెప్పగా.. తన సినీ కెరియర్ లోనే స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ది బెస్ట్ అంటూ ప్రభాస్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇలా స్పిరిట్ సినిమా పోస్టర్ గురించి ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అసలు విలన్ సంజయ్ దత్..

Advertisement

ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా హీరోయిన్లు ముగ్గురు స్పిరిట్ సినిమా గురించి మరికొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేశారు. అయితే ప్రభాస్ మాత్రం ఇప్పుడు స్పిరిట్ గురించి అడగొద్దు అంటూ ఏకంగా దండం పెట్టేసారు. ఇక రాజా సాబ్ సినిమాకి సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ఈ సినిమాలో అసలు విలన్ తన తాతగా నటించిన సంజయ్ దత్ అని ప్రభాస్ తెలియజేశారు. సెకండ్ హాఫ్ నుంచి అసలు సినిమా మొదలవుతుందని ఈయన తెలియచేశారు.

70% కామెడీ ..

Advertisement

ఇక ఈ సినిమాలో దాదాపు 70% కామెడీ ఉంటుందని, కామెడీతో పాటు హర్రర్ ఫాంటసీ నేపథ్యంలో కూడా ఈ సినిమా ఉండబోతోందని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రభాస్ తెలియజేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి. ఇక జనవరి 9వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక నేటి సాయంత్రం నుంచి ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.

Also Read; Vaa vaathiyaar film: జన నాయగన్ వాయిదా.. సంక్రాంతి రేసులో కార్తీ

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×