E-Paper
Advertisement

Rakasa Teaser: సంతోష్ హంగామా అయింది.. ఇక సంగీత్ శోభన్ హడావుడి స్టార్ట్!

Rakasa Teaser: సంతోష్ హంగామా అయింది.. ఇక సంగీత్ శోభన్ హడావుడి స్టార్ట్!
Advertisement

Rakasa Teaser: టాలీవుడ్‌లో కంటెంట్ నమ్ముకుని సినిమాలు తీసే అతికొద్ది మంది నిర్మాతలలో నిహారిక కొణిదెల (Niharika Konidela) ఒకరు. 2024లో వచ్చిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా భారీ విజయాన్ని అందుకున్న ఆమె, ఇప్పుడు తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై పదో వసంతంలోకి అడుగుపెడుతూ ‘రాకాస’ (RaKaSa) అనే క్రేజీ ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేస్తూ చిత్ర బృందం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. మార్చి 1న ‘రాకాస’ టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ, మేకర్స్ వదిలిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- Sree Vishnu: రెండు సినిమాలు ఏకకాలంలో.. ఓటీటీ సమస్యతో పాటు ఇంకో సమస్య కూడా ఉంది!

పోస్టర్ అదిరింది

Advertisement

సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు, ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని రెట్టింపు చేస్తోంది. ఈ పోస్టర్‌లో హీరో సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) లుక్ చాలా వైవిధ్యంగా ఉంది. ఒకవైపు ప్రశాంతమైన పచ్చని పంట పొలాలు, మరోవైపు మంటలు, భయాందోళనలో ఉన్న మనుషులను చూపిస్తూ కథలో ఉన్న సీరియస్‌ను అలాగే కామెడీ లేయర్లను టచ్ చేశారు. ముఖ్యంగా సంగీత్ శోభన్ తన గ్లాసెస్‌ని సర్దుకుంటూ ఇస్తున్న ఎక్స్‌ప్రెషన్, బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న రాక్షస రూపం సినిమాలోని హర్రర్ ఎలిమెంట్స్‌ని హైలైట్ చేస్తున్నాయి. మానస శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయన్ సారిక కథానాయికగా నటిస్తుండగా, అనుదీప్ దేవ్ సంగీతం, రాజు ఎదురోలు విజువల్స్ మేజర్ అసెట్‌గా నిలవనున్నాయి. మొత్తంగా అయితే ఈ పోస్టర్‌తో, టీజర్ కోసం వెయిట్ చేసేలా చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు.

Also Read- Rashmika Mandanna: విజయ్ నా భర్త.. వర్ణించడానికి మాటలు లేవు.. రష్మిక ఎమోషనల్ పోస్ట్!

సంతోష్ క్లాస్.. సంగీత్ మాస్

Advertisement

మరోవైపు శోభన్ వారసుల జోరు బాక్సాఫీస్ వద్ద గట్టిగానే కనిపిస్తోంది. ఇటీవల సంతోష్ శోభన్, మానస వారణాసి నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ థియేటర్లలో విడుదలై సెన్సేషనల్ హిట్ సాధించింది. కేవలం రూ. 1 కోటి బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. పది రోజుల్లోనే దాదాపు రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. సంతోష్ తన క్లాస్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించగా, ఇప్పుడు తమ్ముడు సంగీత్ శోభన్ ‘రాకాస’తో మాస్ అండ్ కామెడీ హంగామా మొదలుపెట్టబోతున్నాడు. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాతో సంగీత్ మరో బిగ్ హిట్ కొట్టడం ఖాయమనేలా టాక్ నడుస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

">

Also Read- The Kerala Story 2: ‘ది కేరళ స్టోరీ 2’ రిలీజ్‌కు కేరళ హైకోర్టు బ్రేక్.. సెన్సార్ బోర్డు తీరుపై ఆగ్రహం

Related News

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×