E-Paper
Advertisement

Rakasa: ‘రాకాస’ నుంచి మెలోడీ సాంగ్ ‘పదే పదే’ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Rakasa: ‘రాకాస’ నుంచి మెలోడీ సాంగ్ ‘పదే పదే’ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
Advertisement

Rakasa: ‘కమిటీ కుర్రోళ్లు’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela).. జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిర్మిస్తోన్న చిత్రం ‘రాకాస’ (Rakasa). మానస శర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌ (Sangeeth Sobhan), న‌య‌న్ సారిక‌ (Nayan Sarika) జంటగా నటిస్తున్నారు. ఏప్రిల్ 3న రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ఈ మూవీ ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, గ్లింప్స్, టీజర్, సాంగ్ అన్నీ కూడా సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్‌లో టీం బిజీబిజీగా ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం ‘పదే పదే’ (Padhe Padhe Lyrical Video) అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్‌ను టీమ్ రిలీజ్ చేసింది.

Also Read- Ustaad Bhagat Singh: పవన్ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. టికెట్ల రేట్లు పెంపు.. ఎంతంటే?

వన్ సైడ్ లవ్ స్టోరీ

Advertisement

ఈ లిరికల్ వీడియో సాంగ్‌ని చూస్తుంటే హీరో మీద హీరోయిన్‌కి ఉన్న ప్రేమ, వన్ సైడ్ లవ్ స్టోరీని తెలియజేస్తోంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, వారి ప్రేమను చాటేలా సాంగ్ సాగింది. గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించిన ఈ పాటలోని విజువల్స్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి.
‘‘ప‌దే ప‌దే ప్రాణం నిన్నే కోర‌గా
క‌లే నిజం కాదా నిన్ను చేర‌గా
ఒకే ఒక ఆశ చాలుగా నువ్వే చాలుగా
ప్ర‌పంచ‌మే లేదే ప్ర‌తీ క్ష‌ణం నువ్వే నా క‌థ‌’’ అంటూ అమ్మాయి త‌న మ‌నసులోని ప్రేమ‌ను అబ్బాయికి చెప్ప‌టానికి ఎంతో ఆశ‌తో, ఆతృత‌గా ఎదురుచూస్తోంది. కానీ అబ్బాయి మాత్రం అమ్మాయి ప్రేమను పట్టించుకోకుండా, తన పని ఏదో తను చూసుకుంటూ ఉంటాడు. మరి ఆ అమ్మాయి ప్రేమ, ఆ అబ్బాయికి ఎలా తెలిసిందనేది తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read- CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఏ హీరో ఫ్యాన్ అంటే?

ప్రేమికులకు పర్ఫెక్ట్ ఛాయిస్

Advertisement

పాల విషయానికి వస్తే.. అనుదీప్ దేవ్ అందించిన స్వరాలు, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం, సింధూజ శ్రీనివాసన్ గాత్రం ఈ పాటను మరింత ప్రత్యేకంగా, గుండెల్ని హత్తుకునేలా మార్చేశాయి. కొత్తగా ప్రేమను తెలియజేయడానికి, కొత్తగా ప్రేమలో పడిన వారు పాడుకోవడానికి ఈ పాట పర్ఫెక్ట్ అనేలా ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వ‌ర్ అలీ ఎడిట‌ర్‌‌గా పని చేశారు. ఈ మూవీ ఆడియో హక్కుల్ని సరిగమ సంస్థ సొంతం చేసుకోగా.. ఓవర్సీస్‌లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్, కెనడాలో ప్రత్యంగిరా సినిమాస్ ఏప్రిల్ 3న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుక్వింద‌ర్ సింగ్‌, అన్న‌పూర్ణ‌మ్మ‌ వంటి వారు ఇతర పాత్రలలో కనిపించనున్నారు.

Also Read- Aaya Sher Song: ‘ది ప్యారడైజ్’లోని ‘ఆయా షేర్’ కోసం నిర్మించిన స్లమ్ సామ్రాజ్యం బ్యాక్ స్టోరీ ఇదే..

Related News

శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ఆకట్టుకుంటున్న ‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్!

78వ ఎమ్మీ అవార్డ్స్ తుది జాబితా.. అత్యధిక నామినేషన్స్ అందుకున్న షోలు!

హాస్పిటల్ పాలైన మమితా బైజు.. వీడియో వైరల్!

హరికృష్ణ 70వ జయంతి..ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్!

ఐదుసార్లు చావును దగ్గరగా చూశాను.. అదే నాకు ఇంపార్టెంట్.. హీరో కామెంట్స్..

“ప్రజలు మెచ్చిన నాయకుడు”.. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్!

Poojitha Ponnada : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

HBD Pawan Kalyan : బర్త్ డే స్పెషల్.. ఆ ఒక్కటే పవర్ స్టార్ ను చేసిందా..?

Big Stories

Advertisement
×