Historical Movie OTT : మలయాళ, తమిళ సినిమాల తర్వాత ఇప్పుడు ఒక పంజాబీ సినిమా ఓటీటీలో దూసుకుపోతోంది. 1840ల నేపథ్యంలో సాగే ఈ చిత్రం మహారాజా రంజిత్ సింగ్ మరణం తర్వాత పంజాబ్‌లో ఏర్పడిన అల్లకల్లోల పరిస్థితులను చూపిస్తుంది. పక్కా ఊర మాస్ స్టైల్‌లో సాగే ఒక వీరుడి పోరాటం ఈ సినిమా. హిస్టారికల్ యాక్షన్ డ్రామా లవర్స్ మిస్ చేయకూడని సినిమా ఇది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం.
ఈ హిస్టారికల్ యాక్షన్ సినిమా పేరు ‘అకాల్ : ది అన్‌కంక్వర్డ్’ (Akaal: The Unconquered). ప్రముఖ పంజాబీ స్టార్ గిప్పీ గ్రెవాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో నటించారు. 2025 ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ పొందిన ఈ చిత్రం ఇప్పుడు అంటే, మార్చి 12 నుంచి చౌపాల్ (Chaupal) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో గిప్పీ గ్రెవాల్‌తో పాటు నిమ్రత్ ఖైరా, గుర్ప్రీత్ గుగ్గి, నికితిన్ ధీర్, షిందా గ్రెవాల్ ముఖ్య పాత్రలు పోషించారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ (కరణ్ జోహార్) పంజాబీలో నిర్మించిన మొదటి సినిమా ఇది. ఇది ప్రస్తుతం పంజాబీ, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది.
మహారాజా రంజిత్ సింగ్ చనిపోయాక, పంజాబ్ గడ్డ మీద అంతా అల్లకల్లోలం అవుతుంది. రాజ్యానికి దిక్కులేక, దొరికినోడు దొరికినట్టు దోచుకుందామని చూస్తుంటారు. ఆ టైమ్‌లో ఊర్ల మీద పడి అమాయకులను ఆగం చేసే రౌడీ మూకలు ఎక్కువైతాయి. అప్పుడు హీరో అకాల్ సింగ్ (గిప్పీ గ్రెవాల్) రంగంలోకి దిగుతాడు. తన ఊరి జోలికి, తన జనం జోలికి ఎవడొచ్చిన వాడికి వాచిపోతూ ఉంటుంది.
అకాల్ సింగ్ మామూలోడు కాదు, పక్కా మొండి పిండం. ఎదురుగా ఎంత పెద్ద సైన్యం ఉన్నా భయపడకుండా ఒంటిచేత్తో కొట్టే రకం. శత్రువులకి వణుకు పుట్టించేలా కత్తి పట్టి యుద్ధం చేస్తాడు. తన వాళ్లకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోని ఒక గడ్డ పులి లాంటి వాడు అకాల్.
ఇక సినిమాలో అకాల్ సింగ్ కు గట్టి పోటీ ఇచ్చే మొండి విలన్ జంగీ జహానా. ఈ పాత్రను బాలీవుడ్ నటుడు నికితిన్ ధీర్ (చైన్నై ఎక్స్‌ప్రెస్‌లో ‘తంగబలి’గా ఫేమస్) చేశాడు. ఆయన భారీ కాయం, ఆ గెటప్ చూస్తేనే భయం కలిగేలా ఉంటుంది. మహారాజా రంజిత్ సింగ్ చనిపోయిన తర్వాత రాజ్యంలో అసలు అధికారం ఎవరి చేతిలో లేని టైమ్‌లో, ఈ జంగీ జహానా తన రౌడీ మూకతో ఊర్ల మీద పడి దోచుకుంటాడు. అమాయక ప్రజలను హింసిస్తూ, తన మాటే శాసనం కావాలని చూస్తాడు. ఈ క్రమంలో అకాల్ సింగ్ ఉండే గ్రామాన్ని టార్గెట్ చేసి, అక్కడ రక్తపాతం సృష్టించడానికి వస్తాడు. ఇప్పుడు హీరోకి, వీడికి మధ్య జరిగే యుద్ధమే సినిమాకి హైలైట్ అవుతుంది. చివరికి ఆ ఊరిని విలన్ల బారి నుండి అకాల్ ఎలా కాపాడాడు? తను నమ్మిన ధర్మం కోసం ఎంత దూరం వెళ్ళాడు? అనే విషయాలను,ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : పెళ్లి చేసుకునే గే జంట… అమ్మాయి ఎంట్రీతో మ్యాటర్ మరింత… అబ్బబ్బా అన్నీ అలాంటి సీన్లు