E-Paper
Advertisement

Aaya Sher Song: ‘ది ప్యారడైజ్’లోని ‘ఆయా షేర్’ కోసం నిర్మించిన స్లమ్ సామ్రాజ్యం బ్యాక్ స్టోరీ ఇదే..

Aaya Sher Song: ‘ది ప్యారడైజ్’లోని ‘ఆయా షేర్’ కోసం నిర్మించిన స్లమ్ సామ్రాజ్యం బ్యాక్ స్టోరీ ఇదే..
Advertisement

Aaya Sher Song: నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) చిత్రంలోని ‘ఆయా షేర్’ సాంగ్ (Aaya Sher Song).. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. పలు భాషల్లో విడుదలైన ఈ సాంగ్ మిలియన్ల వ్యూస్ సాధించడంతో పాటు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోనూ రికార్డ్‌లు సృష్టిస్తోంది. ఈ పాట ఇంతగా ట్రెండ్ అవ్వడానికి కారణం మాత్రం.. పాటలో కనిపించే స్టన్నింగ్ సెట్స్ అనే భావించాలి. ఇందులో చూపించిన ప్రపంచాన్ని తీర్చిదిద్దేందుకు మేకర్స్ ఒక భారీ స్లమ్ సామ్రాజ్యాన్ని నిర్మించారంటే.. ఎంతగా ఈ పాటపై ఫోకస్ చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇందులో హీరోను స్లమ్‌ల సామ్రాట్‌లా చూపించేలా ప్రత్యేకంగా సెట్స్ రూపొందించినట్లుగా తాజా మేకర్స్ అసలు కథని చెప్పేశారు. ఈ స్లమ్ సామ్రాజ్యం వెనుక ఉన్న స్టోరీ గురించి చెబుతూ..

హీరో హౌస్ కోసం భారీగా..

ఈ పాటలో ఆకట్టుకునే సెటప్‌లలో ఒకటి హీరో హౌస్ (కమాన్ సెట్). హీరో కోసం ఇందులో ఈ భారీ నిర్మాణాన్ని రూపొందించారు. ఈ నిర్మాణం వెడల్పు 60 అడుగులు, ఎత్తు 45 అడుగులు, లోతు 25 అడుగులతో నిర్మించబడింది. మొదట ఈ సెట్‌ను 30 అడుగుల వెడల్పుతో నిర్మించగా, తర్వాత ఇరువైపులా 15 అడుగుల చొప్పున విస్తరించి మొత్తం వెడల్పును 60 అడుగులకు పెంచారట. దాదాపు 25 మంది కార్మికులు సుమారు 20 రోజుల పాటు శ్రమించి ఈ భారీ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లుగా మేకర్స్ చెప్పారు. సెట్ చుట్టుపక్కల వాతావరణంలో సహజంగా కలిసిపోయేలా ప్రత్యేక ఏజింగ్ టెక్నిక్స్ ఉపయోగించి దాన్ని మరింత సహజంగా కనిపించేలా తీర్చిదిద్దారట.

Advertisement

Also Read- Arjun Das: ఓజి నటుడికి లవ్ బ్రేకప్..సంచలనంగా మారిన పోస్ట్!

ఒక చెరువునే నిర్మించారు

వాటర్ బాడీ విలేజ్ సెట్ ఇందులో మరో హైలెట్. ఇది 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయగా.. ఇందులో డమ్మీ నిర్మాణాలు కాకుండా.. దాదాపు 60 ఇళ్లు పూర్తి స్థాయిలో నిర్మించారట. దాదాపు 50 మంది కార్మికులు 30 రోజుల పాటు శ్రమించి ఈ గ్రామాన్ని నిర్మించినట్లుగా టీమ్ తెలిపింది. ఒకేసారి సుమారు 500 మంది ఉండేలా ఈ గ్రామాన్ని డిజైన్ చేశారట. వాటర్ బాడీ కోసం 100 ట్యాంకర్ల నీటిని తీసుకువచ్చి ఏడు రోజుల పాటు నింపారు. అదనంగా నీటిని నిల్వ ఉంచేందుకు 20, 20 అడుగుల పరిమాణంతో, 20 అడుగుల లోతు ఉన్న ఒక చెరువును కూడా నిర్మించడం విశేషం. నిర్మాణంలో భాగంగా మరో భారీ డంప్ యార్డ్ సెట్ కూడా నిర్మించారట. ఇది 120 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుతో రూపొందించబడిందని, దాదాపు 25 మంది సభ్యులతో కూడిన బృందం 30 రోజుల పాటు శ్రమించి ఈ సెట్‌ను నిర్మించినట్లుగా మేకర్స్ తెలియజేశారు. నిజమైన డంప్ యార్డ్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సహజమైన, నివసిస్తున్నట్లు అనిపించే లుక్ వచ్చేలా దీనిని డిజైన్ చేశారట.

Advertisement

Also Read- Varalakshmi Sarathkumar: పిల్లలపై వరలక్ష్మీ ఊహించని కామెంట్స్.. ఆర్థికంగా ఎవరూ సహాయం చేయరంటూ?

అన్ని అనుమతులతో..

ఈ సెట్స్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపింది ఏమిటంటే, ప్రకృతిని ఎక్కడా దెబ్బతీయకుండా నిర్మించడం. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చాలా జాగ్రత్తగా ఈ నిర్మాణాలను సహజ భూభాగంలో కలిసిపోయేలా తీర్చిదిద్దిందని.. రియలిజం, సహజత్వం పెరగడానికి సహజ టెక్స్చర్లు, ఏజింగ్ టెక్నిక్స్ విస్తృతంగా ఉపయోగించారని ఈ అప్డేట్‌లో మేకర్స్ వెల్లడించారు. ప్రతి సెటప్‌ను అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేసి, అవసరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఈ నిర్మాణాలను పూర్తి చేశారట. రేపు సినిమా విడుదల తర్వాత వరల్డ్ బిగ్ స్క్రీన్ పై ఈ సినిమా ఎంత గొప్ప అనుభూతిని అందించబోతుందనేది.. ఈ ‘ఆయా షేర్’ సాంగ్ అద్భుతంగా ప్రజెంట్ చేసిందని చెప్పక తప్పదు.

Also Read- Deewana Movie: చిన్న సినిమాకు పెద్ద రీచ్.. ‘దీవానా’ టీజర్ రెస్పాన్స్ అదిరిందిగా..

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×