BigTV English

Sania Mirza: టాలీవుడ్ స్టార్ హీరోతో సానియా పెళ్ళా.. క్లారిటీ వచ్చేసింది!

Sania Mirza: టాలీవుడ్ స్టార్ హీరోతో సానియా పెళ్ళా.. క్లారిటీ వచ్చేసింది!
Advertisement

Sania Mirza:టెన్నిస్ క్రీడాకారిణిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సానియా మీర్జా (Sania Mirza) ఇప్పుడు మళ్లీ పెళ్లికి సిద్ధమైందనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గతంలో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకొని.. ఒక కొడుకుకు జన్మనిచ్చిన ఈమె.. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం కొడుకుతో జీవితాన్ని కొనసాగిస్తున్న ఈమె.. సింగిల్ మదర్ గానే కెరియర్ లో ముందుకు వెళ్తోంది. అయితే ఇప్పుడు ఈమె గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


తాజాగా సానియా మీర్జా ఒక టాలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమలో పడిందనే వార్త అందరిని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఒక కాఫీ షాప్ లో ఇద్దరు మీట్ అయ్యారని.. క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చినట్లు సమాచారం. అయితే ఆ హీరో పేరు మాత్రం బయటకు రాలేదు. దీంతో త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉండబోతోంది అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా సానియా మీర్జా ఒక టాలీవుడ్ హీరోతో ప్రేమలో పడిందనే వార్తలలో ఎలాంటి వాస్తవం లేదు అని.. కేవలం ఇది ఒక గాసిప్ మాత్రమే అని కొంతమంది కొట్టి పారేస్తుంటే.. ఏమో ఇలాంటి వార్తలే రేపటి రోజున కార్యరూపం దాలుస్తాయి.. నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటూ ఎవరికి వారు తమ అభిప్రాయాలుగా వ్యక్తపరుస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే సానియా తెలుగింటి కోడలు కాబోతోంది అని చెప్పవచ్చు.

గతంలో కూడా ఇలాంటి రూమర్స్..


ఇదిలా ఉండగా గతంలో కూడా సానియా మీర్జా ఇలాంటి రూమర్స్ ను ఎదుర్కొంది. ప్రముఖ క్రికెటర్ మహమ్మద్ షమీని ఈమె వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు ఇరువురి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారని.. అందుకే తన కొడుకు సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు రాగా.. ఈ వార్తలను కొట్టి పడేశారు సానియా మీర్జా తండ్రి. అలా రూమర్స్ కి చెక్ పడింది. ఇప్పుడు టాలీవుడ్ హీరోతో రెండో పెళ్లి అంటూ మళ్ళీ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ వార్తలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.

సానియా మీర్జా కెరియర్..

ఇక సానియా మీర్జా కెరియర్ విషయానికి వస్తే.. భారత టెన్నిస్ క్రీడాకారిణిగా పేరు సొంతం చేసుకుంది. ఆమె మహిళల డబుల్స్ లో నెంబర్ వన్ ర్యాంకును పొందిన క్రీడాకారిణిగా రికార్డ్ చేసింది. 2003 నుండి 2013లో సింగిల్స్ నుండి విరమణ తీసుకునే వరకు ఈమె భారతదేశం లో సింగిల్స్, డబుల్స్ విభాగాలలో నెంబర్ వన్ క్రీడాకారిణి గానే గుర్తింపు సొంతం చేసుకుంది. అంతేకాదు అత్యధిక పారితోషకం అందుకునే అథ్లెటిక్ క్రీడాకారిణిగా కూడా పేరు సొంతం చేసుకుంది సానియా మీర్జా. ఇక సానియా మీర్జా ఆఫ్రో – ఆసియా క్రీడల్లో ఏకంగా 14 పథకాలు సాధించగా.. అందులో ఆరు బంగారు పథకాలు కూడా ఉన్నాయి.

ALSO READ:Actress Tanya: లిప్ లాక్ తో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన చిరంజీవి బ్యూటీ.. ప్రియుడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

Related News

The Raja Saab: అనుకున్నట్టే చేశాడు.. రాజా సాబ్‌పై మారుతిపై ఫ్యాన్స్ ఫైర్

Chiranjeevi : చిరు కేసుపై కోర్టు షాకింగ్ తీర్పు.. ఇకపై ‘మెగాస్టార్’ ట్యాగ్ వాడొద్దు..

Gummadi Narasaiah: గుమ్మడి నరసయ్యగా శివన్న.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్!

Chiranjeevi:మన శంకర వరప్రసాద్ సెట్లో పెళ్లికానీ ప్రసాద్.. ఇది కదా ఇండస్ట్రీకి కావాల్సింది

Renu Desai: నా పిల్లలను వదిలేసి.. సన్యాసం తీసుకుంటున్నా.. కానీ,

Upasana Konidela: అఫీషియల్… రెండో వారసుడు రాబోతున్నట్లు ప్రకటించిన మెగా కోడలు

SKN: బండ్లన్న అలా చేస్తే ఇండస్ట్రీకి ప్రమాదం… నిర్మాత SKN షాకింగ్ కామెంట్!

Fauzi: పుట్టుకతో అతను ఒక యోధుడు.. అదిరిపోయిన ఫౌజీ లుక్

Big Stories

×