Actress Tanya: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటించిన ప్రముఖ హీరోయిన్ తాన్య (Tanya ) ప్రేమలో పడినట్లు స్పష్టం చేసింది. నేరుగా ఒక లిప్ లాక్ ఫోటోని షేర్ చేస్తూ త్వరలోనే పెళ్లి అంటూ కూడా చెప్పుకొచ్చింది. అసలు ప్రేమలో ఉన్న విషయమే తెలియదు అప్పుడే పెళ్లి ఏంటి అని ఈ విషయం తెలిసిన నెటిజన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాన్యను ప్రేమలో పడేసిన వ్యక్తి ఎవరు? ఎవరిని ఆమె వివాహం చేసుకోబోతోంది? అతడు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ప్రేమలో పడ్డ చిరంజీవి బ్యూటీ..
ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది తాన్య రవిచంద్రన్ (Tanya Ravichandran).. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార(Nayanthara )చెల్లిగా చేసింది. ఈ సినిమాలో ఈమె చేసింది చిన్న పాత్ర అయినా ఈ పాత్రతో అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా కంటే ముందు ‘పేపర్ రాకెట్’ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక కోలీవుడ్ లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సినిమాలలోనే నటించిన ఈమె.. ఇప్పుడు ప్రేమలో పడింది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
లిప్ లాక్ తో లవ్ రిలేషన్ కన్ఫామ్ చేసిన తాన్య..
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాను తాజాగా ప్రేమలో పడినట్లు ఒక వ్యక్తితో లిప్ లాక్ చేస్తున్న పిక్ ని షేర్ చేస్తూ..” ఒక ముద్దు.. ఒక ప్రామిస్.. ఎప్పుడూ.. ఎప్పటికీ కలిసే ఉంటాయి” అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ఇక అంతే కాదు త్వరలోనే పెళ్లి అంటూ కూడా హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చింది. ఇది చూసిన చాలామంది తాన్యాకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇలా ఒకేసారి లిప్ లాక్ పోస్టుతో క్లారిటీ ఇవ్వడం చూసి అభిమానులు అప్పుడే పెళ్ళా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
తాన్య కాబోయే భర్త ఎవరంటే..
కాబోయే భర్త ఎవరు అంటే ఆయన ఎవరో కాదు డీఓపీ (సినిమాటోగ్రాఫర్) గౌతమ్ జార్జ్ (Gautam George) . కోలీవుడ్ లో పెద్ద సినిమాటోగ్రాఫర్ గా పేరు సొంతం చేసుకున్నారు. ప్రముఖ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ సినిమాతో పాటు పలు చిత్రాలకు డీఓపీగా పనిచేశారు. ఇక అంతే కాదు అన్నాబేళ్లే సేతుపతి, మదిల్ మేల్ కాదల్ వంటి చిత్రాలకు కూడా పనిచేశారు. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోంది ఈ జంట. ఏది ఏమైనా యంగ్ బ్యూటీ తాన్య కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోబోతుండడం గమనార్హం.
ALSO READ:Fahad Fazil: పుష్ప విలన్ వాడే ఫోన్ ఖరీదు తెలిస్తే షాక్.. మరీ ఇలా అయితే ఎలా?