BigTV English

Big Shock to Kethireddy: జేసీ పంతం.. పెద్దా రెడ్డికి కష్టమేనా?

Big Shock to Kethireddy: జేసీ పంతం.. పెద్దా రెడ్డికి కష్టమేనా?

Big Shock to Kethireddy: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరో షాక్ తగిలింది. తాడిపత్రి పర్యటనకు మరోసారి కూడా ఆయనకు అనుమతి లభించలేదు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు తాడిపత్రిలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనడానికి సిద్దమైన కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. దాంతో పెద్దారెడ్డి తన పర్యటనను ఎప్పటిలాగే మరోసారి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అదలా ఉంటే పెద్దారెడ్డి తాడిపత్రి రావడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారం అందగానే హాలీ డే ట్రిప్‌లో ఉన్న టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి స్పెషల్ ఫ్లైట్‌లో తాడిపత్రి రావడం సంచలనంగా మారింది. పెద్దారెడ్డిని తాడిపత్రితో అడుపెట్టనివ్వనంటున్న జేసీ పంతంతో ఇక ఆయన సొంత ఇంట్లో అడుగుపెట్టడం కష్టమే అన్న అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది


వైసీపీ హయంలో తాడిపత్రిలో జేసీ ప్రభాకరరెడ్డికి చేదు అనుభవాలు

అనంతపురం జిల్లా తాడిపత్రి పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డికి ఎదురైన చేదు అనుభవాలు.. ఇప్పుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చవిచూడాల్సి వస్తోంది. ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టకుండా కోర్టు ఆంక్షలు విధించింది. అయితే తర్వాత హైకోర్టు ఆదేశాలతో సొంత ఇలాకాలోకి వెళ్లేందుకు పెద్దారెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తుంటే.. జేసీ వర్గీయుల తిరుగుబాటుతో పోలీసులు ఎప్పటికప్పుడు పెద్దారెడ్డికి అనుమతి నిరాకరిస్తున్నారు.


మహానాడు, రాప్తాడు జంట హత్యలు, ప్రధాని పర్యటన..

ఇప్పటికే మహానాడు, రాప్తాడు జంట హత్యలు, ఎంపీపీ ఉపఎన్నికలు, ప్రధాని పర్యటన అంటూ పలుమార్లు పోలీసులు పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనలకు అనుమతులు నిరాకరించారు. ఈ నెల 5న పెద్దారెడ్డి మరోసారి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి కోరుతూ పోలీసులకు లేఖ రాశారు. జగన్ పిలుపు మేరకు తాము తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం నిర్వహించాలని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లి అనుమతి కోరారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతిస్తూ ఏపీ హైకోర్టు ఏప్రిల్ 30న ఆదేశాలు జారీ చేసింది. అయితే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లినప్పుడు తగిన భద్రత కల్పించాలని ఆదేశాల్లో పేర్కాంది.

సొంత ఇంట్లో అడుగుపెట్టే భాగ్యం పెద్దారెడ్డికి లేదా?

తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సొంత ఇంట్లో అడుగుపెట్టే భాగ్యం లేనట్లు కనిపిస్తోంది. ఆయన ఎప్పుడు తాడిపత్రి బయలుదేరినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతూ.. పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు . ఆ క్రమంలో తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి తాడిపత్రి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుని, పార్టీ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సైతం ఆ జిల్లా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి లేఖ రాశారు.

కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరోసారి పోలీసుల షాక్

ఈ సారి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. తాడిపత్రికి రావొద్దని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డికి నోటీసులు అందించారు. ఇవాళ తాడిపత్రిలో మంత్రుల ప్రొగ్రాం ఉందని.. శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉండటంతో వైసీపీ నేతలు తమ సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈనెల 18 లేదా ఆ తర్వాత కార్యక్రమం నిర్వహించుకోవచ్చని సూచించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చేసేది ఏమి లేక వెనక్కి తగ్గారు. ఈ నెల 18న ఈ కార్యక్రమాన్ని జరుపుతామని పెద్దారెడ్డి అంటున్నారు.

Also Read: చిన్నారెడ్డి గుస్సా.. వనపర్తి కాంగ్రెస్‌లో కోట్లాట

తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి , వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వైరం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. వారిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే అంటుకునే విధంగా ఉంది. కాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారు అన్న సమాచారాన్ని విహార యాత్రలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి అక్కడి టీడీపీ కార్యకర్తలు సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన హుటాహుటిన ప్రత్యేక విమానంలో విహారయాత్ర నుంచి తాడిపత్రి బయలుదేరి వచ్చారు. ఈ నేపధ్యంలో ఒకవేళ పెద్దారెడ్డి తన తాడిపత్రి పర్యటనను వాయిదా వేసుకోకపోయుంటే అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకునేవి అంటున్నారు. జేసీ ప్రభాకరరెడ్డి ప్రైవేటు ఫ్లైట్‌లో తాడిపత్రికి రిటర్న్ అవ్వడంతో పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వకూడదని ఆయన ఎంత పట్టుదలతో ఉన్నారన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది.

Story By Rami Reddy, Bigtv

Related News

GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Congress: గుత్తా లేఖల వెనక సీక్రెట్ ఏంటి?

AP Politics: టీడీపీలో సంస్థాగత మార్పులపై రచ్చ!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొత్తం స్క్రిప్టా… మరీ ఇంత మోసమా?

AP Politics: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?

Big Stories

×