E-Paper
Advertisement

Sanjay Dutt: టెస్లా సైబర్ లో ముంబై రోడ్లపై చక్కర్లు కొట్టిన సంజయ్ దత్.. వీడియో వైరల్!

Sanjay Dutt: టెస్లా సైబర్ లో ముంబై రోడ్లపై చక్కర్లు కొట్టిన సంజయ్ దత్.. వీడియో వైరల్!
Advertisement

Sanjay Dutt: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు సంజయ్ దత్(sanjay Dutt) ఒకరు. ఒకానొక సమయంలో హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంజయ్ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు ఇటీవల ఈయన నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని 1000 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా సంజయ్ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ (Dhurandhar)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

టెస్లా సైబర్ ట్రక్ లో సంజయ్ దత్..

ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా సక్సెస్ అనంతరం సంజయ్ దత్ ఇటీవల ముంబై వీధులలో టెస్లా కారులో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా టెస్లా సైబర్ ట్రక్ ఇండియాలో కనిపించడం చాలా అరుదు. అలాంటిది సంజయ్ దత్ ఈ టెస్లా సైబర్ ట్రక్ లో సందడి చేస్తూ కనిపించారు. ఇక ఈ కారును చూస్తుంటే బహుశా ఈయన ఈ టెస్లా కారును దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నారని తెలుస్తోంది. దాని లైసెన్స్ ప్లేట్, డ్రైవింగ్ గేర్ ఎడమ వైపున ఉండటం వల్ల ఈ కారు కార్నెట్ పర్మిట్ కింద దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నారని స్పష్టం అవుతుంది.

కస్టమ్స్ టాక్స్ అవసరం లేదు…

Advertisement

కార్నెట్ పర్మిట్ కింద వాహనాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఆరు నెలల పాటు ఇండియాలో ఉండటానికి అనుమతి తెలుపుతారు ఈ పర్మిట్ కింద వచ్చే వాహనాలకు ఎలాంటి  కస్టమ్స్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక సంజయ్ దత్ నడిపిన ఈ టెస్లా కారు బేసిక్ మోడల్ ధర సుమారు 72 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.ఈ కారు  బుల్లెట్‌ప్రూఫ్ బాడీని కలిగి ఉండటమే కాకుండా 3 సెకన్ల సమయంలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలరు.

?igsh=MTNqOHl3dWl1MHk3MQ%3D%3D

Advertisement

ఇక సంజయ్ దత్ గ్యారేజ్ లో ఖరీదైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-మేబాచ్ GLS 600, ల్యాండ్ రోవర్ డిఫెండర్ వంటి ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ సంజయ్ దత్ భారీగా ఆస్తులను కూడా సంపాదించారు. ఇక కెరియర్ విషయానికి వస్తే ఇటీవల ధురందర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంజయ్ దత్ ఇటీవల మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ పెద్దగా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ ప్రభాస్ తాతయ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Also Read: Actor Sunil: ఆ గుణమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది.. సునీల్ ఎమోషనల్ కామెంట్స్!

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×