E-Paper
Advertisement

Actor Sunil: ఆ గుణమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది.. సునీల్ ఎమోషనల్ కామెంట్స్!

Actor Sunil: ఆ గుణమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది.. సునీల్ ఎమోషనల్ కామెంట్స్!
Advertisement

Actor Sunil: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్  గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సునీల్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈయనకు ఏకంగా రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం లభించింది. ఇలా రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు ప్రతి ఒక్కరు కూడా ఆయన డైరెక్షన్లో సినిమా చేయాలని కోరుకుంటారు. అలాంటిది సునీల్ కు పిలిచి మరి మర్యాద రామన్న సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

కమెడియన్ గా గుర్తింపు పొందిన సునీల్..

ఇలా ఈ సినిమా తర్వాత సునీల్ కమెడియన్ గా సినిమాలు పక్కన పెట్టి హీరోగా పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తదుపరి సునీల్ హీరోగా నటించిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి దీంతో సునీల్ (Suneel) హీరోగా కాకుండా కమెడియన్ పాత్రల ద్వారానే మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా రవితేజ (Raviteja)హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి(BMW Film) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో రవితేజ సునీల్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం తాజాగా బ్లాక్ బాస్టర్ ప్రెస్ మీట్ అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

కష్టపడితేనే సక్సెస్..

Advertisement

ఈ కార్యక్రమంలో భాగంగా సునీల్ తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సునీల్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇండస్ట్రీలో తాను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం కష్టపడే గుణమేనని తెలియజేశారు. మనకు సుఖాన్ని ఇచ్చేది ఎప్పుడు కూడా చెడు చేస్తుందని, కానీ ఏదైతే మనల్ని కష్టపడుతుందో అదే మనకు మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడుతుందని సునీల్ తెలిపారు.

రవితేజ ఎనర్జీని మ్యాచ్ చెయ్యలేం..

Advertisement

తనను కష్టపెట్టే గుణమే ఈ స్థాయిని, గుర్తింపును ఇచ్చిందని పేర్కొన్నారు. తన దృష్టిలో కష్టపడే తత్వమే గుడ్ పర్సన్ అంటూ సునీల్ ఈ సందర్భంగా కాస్త ఎమోషనల్ అయ్యారు. సునీల్ ఇలా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సునీల్ చెప్పింది అక్షర సత్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రవితేజ గురించి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రవితేజతో తనకు చాలా మంచి రిలేషన్ ఉందని, ఎప్పుడు నేను ఖాళీగా ఉన్న రవితేజ గారి దగ్గరికి వెళ్లి అతని ఆయనతోనే సమయం గడుపుతూ ఉంటానని, రవితేజ మోస్ట్ ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్, ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టమని రవితేజకు ఒక సెంటిమెంట్ క్యారెక్టర్ ఇచ్చిన ఫ్లో మాత్రం తగ్గదు అంటూ రవితేజ గురించి కూడా సునీల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: Renu Desai: మహేష్ బాబు సినిమాలో రేణు దేశాయ్.. కుట్ర చేశారన్న నటి?

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×