E-Paper
Advertisement

Mars Kitchen Contest: మీకు వంటలంటే పిచ్చా? NASA మీకు రూ.6.75 కోట్లు ఇస్తుందట!

Mars Kitchen Contest: మీకు వంటలంటే పిచ్చా? NASA మీకు రూ.6.75 కోట్లు ఇస్తుందట!
Advertisement

మీకు వంటలంటే పిచ్చా? కొత్త కొత్త ప్రయోగాలతో వెరైటీలు చేయాలని పరితపిస్తున్నారా? సరికొత్త ఆవిష్కరణలతో గుర్తింపు పొందాలని అనుకుంటున్నారా? అయితే, మీకు రూ.6.75 కోట్లు మీవే. ఈ ఆఫర్ అందుకోడానికి మీరు ఫ్లాష్ మ్యాన్ కావక్కర్లేదు. జస్ట్ NASA ప్రకటించిన క్వాలిటీలు మీలో ఉన్నాయో లేదో సరిచూసుకుంటే చాలు. ఆ డబ్బులు మీవే. అంత డబ్బంటే.. ఏదో తిరకాసు ఉండే ఉంటుందని అనుకుంటున్నారా? రిస్కు లేకపోతే రస్కులు చేసుకుంటూ బతికేయాలి. కాబట్టి.. ట్రై చేయండి పోయేది ఏముంది?

నాసా అంటేనే ప్రయోగాలు.. కానీ, ఈసారి కొత్తగా!

అంతరిక్షంలోకి వెళ్లేవారికి ప్రత్యేకంగా ప్యాక్ చేసిన ఫుడ్ టిన్స్ ఇస్తారు. అవి ఎన్నేళ్లయినా చెక్కుచెదరకుండా ఉంటాయి. ఎందుకంటే.. అంతరిక్షంలో వంట చేసుకోవడం కుదరదు. పైగా నాసా.. అంగాకర గ్రహం (మాస్) మీద అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తోంది. అక్కడికి వెళ్లాలి అంటే.. అంత ఈజీ కాదు. కొన్ని సంవత్సరాలకు సరిపడా ఫుడ్ వెంట తీసుకెళ్లాలి. ఫుడ్ మాత్రమే కాదు.. నీరు కూడా కావాలి. అందుకే, నాసాకు ఒక ఐడియా వచ్చింది. అక్కడ ఒక కిచెన్ పెట్టేస్తే ఏ సమస్య ఉండదు కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుడ్ తయారు చేసుకుని తినేయొచ్చు.. హాయిగా బతికేయొచ్చు అని భావిస్తోంది. అయితే, అది అంత ఈజీ కాదు. అందుకే ఫుడ్ గురించి బాగా తెలిసిన చెఫ్‌లు, సరికొత్త వంట సామాగ్రీలను తయారు చేసే క్రియేటర్ల కోసం ఇటీవల ఓ ఆఫర్ ప్రకటించింది.

ఏకంగా రూ.6.75 కోట్లు ఇస్తుందట

Advertisement

డీప్ స్పేస్ ఫుడ్ ఛాలెంజ్: మార్స్ టు టేబుల్ (Deep Space Food Challenge: Mars to Table) పేరుతో నాసా.. గ్లోబల్ కాంటెస్ట్ ప్రారంభించింది. దీనికి ప్రైజ్ మనీని రూ.6.75 కోట్లకు ఫిక్స్ చేసింది. ఇందుకు మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వారి ప్రయోగాలకు అవసరమైన కొన్ని ఐడియాలు ఇస్తే చాలు. మార్స్ ప్రాజెక్టులో ఉపయోగించేందుకు వీలుగా ఉండే ఫుడ్ సిస్టమ్స్ గురించే ఈ కాంటెస్ట్ ఉంటుంది. అంతరిక్షం, మార్స్ మీద పంటలు ఎలా పండించాలి? ఎలాంటి విధానాలు అవలంభించాలి? వ్యోమగాములకు పోషకాహారాన్ని అందించే మార్గాలేమిటీ? భూమి మీద ఆధారపడకుండా.. స్వతంత్రంగా ఆహార ఉత్పత్తులను అక్కడ ఎలా సృష్టించుకోవాలి వంటి అంశాల మీద ఐడియాలు ఇస్తే చాలు. అవి వారికి ఉపయోగకరంగా, అమలు చేయడానికి అనుకూలంగా ఉండే సూచనలైతే ప్రైజ్ మనీ తప్పకుండా మిమ్మల్నే వరిస్తుంది.

చంద్రుడిపైకి.. ప్రి-ప్యాక్డ్ ఫుడ్

ప్రస్తుతం నాసా.. ఆర్టెమిస్ 2 (Artemis II) ప్రయోగంతో చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపేందుకు సిద్ధమవుతోంది. వారి ఆహార అవసరాలను తీర్చడం కోసం మూడేళ్లకు సరిపడా ప్రి-ప్యాక్డ్ ఫుడ్‌ను పంపిస్తుంది. చంద్రుడి మీదకు చేరుకున్న తర్వాత వ్యోమగాములు వేలాది కిలోమీటర్లు నడుస్తూనే ఉంటారు. వారికి శక్తి కావాలంటే పౌష్టికాహారం చాలా ముఖ్యం. అందుకే ప్రత్యేకమైన డబ్బాల్లో ఆహారాన్ని ప్యాక్ చేసి.. వారితో పంపిస్తారు. అయితే, మార్స్ మీద పరిస్థితి వేరు. అది చంద్రుడి కంటే దూరంగా కొన్ని ఏళ్లపాటు ప్రయాణం చేసిన తర్వాత చేరుకోవాలి. మళ్లీ తిరిగి వచ్చే పరిస్థితులు చాలా అరుదు. అందుకే.. అక్కడి వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా అక్కడ కిచెన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు.

ఎవరు అర్హులు?

Advertisement

నాసా కాంటెస్టులో ఎవరైనా సరే పాల్గోవచ్చు. చెఫ్‌లు, స్టూడెంట్లు, సైంటిస్టులు, డిజైనర్లు ఇలా.. ప్రతి ఒక్కరికీ ఛాన్సు ఉంటుంది. అయితే, మీ ఐడియాలు, అర్హతలను బట్టి గ్రూపులుగా విభజించి తుది పోటీదారులను ఎంపిక చేస్తారు. ఇందులో మీరు సెలక్ట్ కావాలంటే.. సూన్యం నుంచి కూడా ఆహారపానీయాలు తయారు చేయగలిగే.. ఐడియాలతో వెళ్లాలి. మార్స్ మీద విపరీతమైన దుమ్ముదూళి ఉంటుంది. వాటిని కూడా ఆహారానికి అనుకూలంగా మార్చుకోగలిగే టెక్నిక్స్ మీకు తెలిసి ఉంటే నాసాతో పంచుకోవచ్చు. చివరిగా.. మార్స్ మీద నివసించే వ్యోమగాముల కోసం ప్రత్యేక ఫుడ్ మెనూ కాన్సెప్ట్, ఫుడ్ సిస్టమ్స్ తయారు చేసే బాధ్యత కూడా మీదే. ఒక వేళ మీ ఐడియాలు మార్స్ మీద ఫెయిల్ అయినా.. భూమి మీద మనుషులకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో వాడుకుంటారు. అంటే అంటార్కిటికా వంటి ప్రాంతాల్లో ఆహార ఉత్పత్తులకు ఆ సిస్టమ్స్ వాడేస్తారు. కాబట్టి.. డోన్ట్ వర్రీ, ఫెయిల్యూర్ గురించి ఆలోచించకుండా.. సక్సెస్ ఫార్ములాతో ఆ కాంటెస్ట్‌లో పాల్గోండి.

Also Read: ఈ పక్షి ఉమ్ము ఖరీదు రూ.10 లక్షలకు పైనే.. లొట్టలేసుకుని మరీ తింటున్నారు!

Tags

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×