E-Paper
Advertisement

Sankranthi Movies 2026 : దిల్ రాజు బ్యానర్ లో రాబోతున్న సంక్రాంతి సినిమాలు.. విజయ్ మూవీ పై క్లారిటీ..

Sankranthi Movies 2026 : దిల్ రాజు బ్యానర్ లో రాబోతున్న సంక్రాంతి సినిమాలు.. విజయ్ మూవీ పై క్లారిటీ..
Advertisement

Sankranthi Movies 2026: ప్రతి ఏడాది సంక్రాంతికి కొత్త సినిమాలు బోలెడు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంటాయి.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మాత్రం బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉండటంతో జనాలు వాటిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు.. ఇక ఈ సంక్రాంతికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఎన్ని సినిమాలు రానున్నయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.. ఈ ఏడాది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్ని సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

దిల్ రాజు బ్యానర్ లో రిలీజ్ కాబోతున్న సినిమాలు..

మన శంకర వరప్రసాద్ గారు..

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, బ్యూటిఫుల్ హీరోయిన్ నయనతార కలిసి జంటగా నటిస్తున్న తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా తెరకెక్కుతుంది.. భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతుంది.. ఇప్పటికే ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి.. ఈ సినిమా జనవరి 12న థియేటర్లోకి రాబోతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాలు చాలావరకు దిల్ రాజు బ్యానర్ లోనే రిలీజ్ అవుతుంటాయి.

అనగనగా ఒక రాజు..

Advertisement

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి కథానాయికగా కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది.. కోనసీమ జిల్లాలో ఓ యువకుడి లవ్ ట్రాక్, సంక్రాంతి సంబరాలతో, ఫ్యామిలీ ఎమోషన్ అన్నీ కలిపి మూవీలో చూపించబోతున్నట్లు గ్లింప్స్, లుక్స్ బట్టి అర్థమవుతోంది.. రావు రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కూడా దిల్ డిస్ట్రిబ్యూటర్ వ్యవహారిస్తున్నారు.

నారి నారి నడుమ మురారీ..

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా, సంయుక్త, సాక్షి వైద్య కీలక పాత్రల్లో నటించిన ‘నారి నారి నడుమ మురారి’ కూడా అదే రోజు విడుదల కానుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తోంది.. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 న థియేటర్లలోకి రాబోతుంది. ఈ మూవీ కూడా దిల్ రాజు బ్యానర్ పై థియేటర్లలో రిలీజ్ కాబోతుంది…

Advertisement

జనవరి 9న మరో భారీ డబ్బింగ్ సినిమా కూడా థియేటర్లలోకి రానుంది. అదే దళపతి విజయ్ నటించిన ‘జన నాయకుడు’.. దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది… ఈ సినిమాకి కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ ఈ సినిమాను తాను రిలీజ్ చేయలేదని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఈ సంక్రాంతికి మూడు సినిమాలు దిల్ రాజు బ్యానర్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి..

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×