Kerala Fire Accident: కేరళలోని త్రిస్సూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షెడ్‌లో పార్క్ చేసిన సుమారు 400 బైక్‌లు కాలి బూడిదయ్యాయి. విద్యుత్ తీగల నుంచి వచ్చిన నిప్పురవ్వల వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గంటన్నరపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇదిలా ఉంటే.. ఒడిశాలోని దెంకనల్ జిల్లా గోపాల్ పూర్ సమీపంలో ఉన్న క్వారీలో భారీపేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరికొంతమంది శిథిలాల క్రింద చిక్కుకున్నట్లు సమాచారం. మృతులను బాలాసోర్ , కియోంఝర్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. అనుమతి లేని అక్రమ పేలుళ్ల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పాటిల్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
కేరళలోని త్రిస్సూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షెడ్‌లో పార్క్ చేసిన సుమారు 400 బైక్‌లు ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. విద్యుత్ తీగల నుంచి వచ్చిన నిప్పురవ్వల వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.… pic.twitter.com/Ask43cUVJl
— ChotaNews App (@ChotaNewsApp) January 4, 2026