E-Paper
Advertisement

Mustafizur Rahman: బీసీసీఐ త‌ప్పించ‌డంపై ముస్తాఫిజుర్ బ‌లుపు మాట‌లు..ఐపీఎల్ 2026 బ్యాన్ చేయాలంటూ ?

Mustafizur Rahman: బీసీసీఐ త‌ప్పించ‌డంపై ముస్తాఫిజుర్ బ‌లుపు మాట‌లు..ఐపీఎల్ 2026 బ్యాన్ చేయాలంటూ  ?
Advertisement

Mustafizur Rahman:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లో ఆడకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు ఇవ్వడంపై బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman ) స్పందించాడు. ఐపీఎల్ నుంచి తొలగించడం చాలా బాధాకరం.. తనకు ఎంతో బాధగా ఉందని వెల్లడించాడు ముస్తాఫిజుర్ రహమాన్. బీసీసీఐ తొలగిస్తే తానేమి చేస్తాను… వాళ్ళు చెప్పినట్లు వినాల్సిందే కదా అంటూ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2026లో ఆడడం తనకెంతో ఇష్టమని తెలిపాడు. దుర‌దృష్టం వెంటాడింది..అందుకే త‌న‌ను తొల‌గించార‌న్నారు. భ‌విష్య‌త్తులో ఛాన్స్ వ‌స్తే, ఇక ఆడ‌తానో ? లేనో ? అంటూ ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ముస్తాఫిజుర్ రహమాన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

ఐపీఎల్ నుంచి తొలగించడం పై ముస్తాఫిజుర్ రహమాన్ రియాక్షన్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నుంచి తొలగించడం పై బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman ) స్పందించాడు. బీసీసీఐ తొలగిస్తే తానేమీ చేస్తానని ఎమోషనల్ అయ్యాడు. ముస్తాఫిజుర్ రహమాన్ పెద్దగా స్పందించక పోయినప్పటికీ, మిగిలిన క్రికెటర్లు మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి పై దుమ్మెత్తి పోస్తున్నారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్లు ఖలీద్ సుజాన్, అస్ర‌ఫుల్ ఇద్దరు కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలిపై ఫైర్ అయ్యారు. రాజకీయాలు వేరు అలాగే క్రికెట్ వేరు అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాలకు క్రికెట్ కు సంబంధం పెట్టడం దారుణం అంటూ మండిపడుతున్నారు. ఈ రెండిటిని వేరువేరుగా చూడాలని చురకలు అంటించారు. వెంటనే ఐపీఎల్ టోర్నమెంట్ ను బంగ్లాదేశ్ ప్రజలు బైకాట్ చేయాలని పిలుపునిచ్చారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా బంగ్లాదేశ్  మ్యాచ్ ల‌ను ఇండియాలో జరగకుండా శ్రీలంకకు తరలించాలని కూడా వాళ్లు కోరారు.

టి20 ప్రపంచ కప్ మ్యాచ్ ల‌ను మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డిమాండ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నుంచి ముస్తాఫిజుర్ రహమాన్ ను తొలగించడం పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చాలా సీరియస్ గా వ్యవహరిస్తాను. తమ ప్లేయర్ ను ఐపీఎల్ నుంచి తొలగించారు కదా… టి20 ప్రపంచ కప్ వేదికలను  ( T20 World Cup 2026 tournament )  కూడా మార్చాలని కొత్త డిమాండ్ తీసుకువచ్చింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియాలో జరిగే బంగ్లాదేశ్ మ్యాచ్ ల వేదికలు మార్చాలని డిమాండ్ చేస్తోంది BCB. తమ మ్యాచ్ లన్ని శ్రీలంకలో నిర్వహించాలని కోరుతోంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియాలో జరిగే బంగ్లాదేశ్ మ్యాచ్ ల వేదికలు మార్చాలని ఐసీసీకి ఫిర్యాదు చేయానుంద‌ట బంగ్లా క్రికెట్ బోర్డు. ఈ మేర‌కు నేష‌న‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

Advertisement

Also Read:  BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×