E-Paper
Advertisement

గ్లామర్ షోతో కాదు.. సింపుల్ లుక్‌తోనే మ్యాజిక్ చేసిన సాన్యా!

గ్లామర్ షోతో కాదు.. సింపుల్ లుక్‌తోనే మ్యాజిక్ చేసిన సాన్యా!
Advertisement

Sanya Malhotra: బాలీవుడ్ బ్యూటీ సాన్యా మల్హోత్రా తన లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో అభిమానులను ఇపుడు ఫిదా చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా స్టైలిష్ లుక్‌లో, చేతిలో కళ్లద్దాలు పట్టుకుని నవ్వుతూ కనిపించిన ఆమె ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సినిమాల్లో తన నటనతో మెప్పించే సాన్యా.. బయట కూడా తన ఫ్యాషన్ లుక్స్ తో అదరగొట్టడం విశేషం.. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు చూస్తుంటే సింపుల్‌గా ఉన్నా స్టైలిష్‌గా ఎలా కనిపించవచ్చో మరో సారి ప్రూవ్ చేసినట్టే కనిపిస్తుంది.

Advertisement

ఈ ఫొటోల విషయానికి వస్తే సాన్యా లేత క్రీమ్ కలర్ టాప్, డార్క్ బ్లూ స్కర్ట్‌లో కనిపించి ఫాలోవర్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. దీనికి తగ్గట్టుగా చిన్న చిన్న ఇయర్ జువెలరీ,న్యాచురల్ మేకప్‌తో పాటు కర్లీ హెయిర్ ఆమె అందాన్నిడబల్ చేసింది అనడంలో సందేహం లేదు. ఇక చేతిలో కళ్లద్దాలు పట్టుకుని కెమెరాకు పోజులిచ్చిన సాన్యా ఫొటోలు ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేస్తాయనడంలో సందేహం లేదు.

సాన్యా మల్హోత్రా సినిమాల విషయానికి వస్తే.. ఆమెకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉందన్న సంగతి చెప్పక్కర్లేదు. 2016లో వచ్చిన దంగల్ సినిమాతోనే ఆమెకు మంచి పేరు వచ్చింది. అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమాలో బబితా ఫోగట్ పాత్రలో సాన్యా అద్భుతంగా నటించి మెప్పించింది. ఆ తర్వాత బధాయి హో సినిమాతో మరో విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ.ఒకరకంగా ఈ రెండు సినిమాలు ఆమె కెరీర్‌కు మంచి పునాది వేశాయనే చెప్పాలి.

Advertisement

ఆ తర్వాత కూడా సాన్యా వరుసగా ఫోటోగ్రాఫ్, లూడో, పగ్లైట్, మీనాక్షి సుందరేశ్వర్ వంటి సినిమాల్లో తన నటనతో అలరించింది.ముఖ్యంగా పగ్లైట్ సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది.ఒకరకంగా మూస పాత్రలు కాకుండా వెరైటీ పాత్రలు సెలెక్ట్ చేసుకోవడంలోనే సాన్యా సక్సెస్ దాగి ఉందని చెప్పొచ్చు.

ఇక సామ్ బహదూర్ సినిమాలోనూ సాన్యా కీలక పాత్రలో కనిపించిన సాన్యా కథల్ సినిమాతో మరోసారి తన సతత చాటింది.ఒకవైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ సాన్యా యాక్టివ్‌గా ఉంటుందని లేటెస్ట్ పిక్స్ తో మరోసారి ప్రూవ్ అయింది.

తన ఫొటోషూట్లు, ఫ్యాషన్ లుక్స్, పర్సనల్ లైఫ్ కి సంబంధించిన మూమెంట్స్ ని అభిమానులతో పంచుకునే ఈ బాంబే బ్యూటీ తాజాగా షేర్ చేసిన ఫొటోలు కూడా ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.చూడాలి మరి పిక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ భామ  వచ్చే రోజుల్లో ఎలాంటి సినిమాలతో పలకరించనుందో !

Tags

Related News

వెంకీ సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది.. రచ్చకు రెడీనా!

రాజకీయాల్లోకి వెళ్లి ఆస్తులన్నీ పోగొట్టుకున్నా.. నరేష్ షాకింగ్ కామెంట్స్!

బొబ్బిలి రాజా తర్వాత నా కెరీర్‌లో ఏం జరిగిందంటే.. శివాజీరాజా కామెంట్స్

‘జైలర్ 2’ జోరు చూస్తుంటే.. వెయ్యి కోట్లు పక్కానా?

సన్‌ఫ్లవర్‌లా మారాలంటున్న రితికా నాయక్.. అసలు మ్యాటర్ ఏంటంటే!

ఒక్కటి కాదు.. ఏకంగా 8 సినిమాలు! జంధ్యాలతో నరేష్ జర్నీమామూలుది కాదుగా !

కొత్త బంగారులోకం 2 పై వరుణ్ సందేశ్ బిగ్ అప్డేట్.. సీక్వెల్ సినిమా రాబోతోందా?

Big Stories

Advertisement
×