AP Local Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల పోలింగ్‌ను ఎన్నికలక సంఘం వాయిదా వేసింది. దీంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 99 పట్టణ, నగర పాలక సంస్థలకు వచ్చే నెల నవంబర్ 1న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమీషన్ తెలిపింది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
గతంలో ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం కాకుండా ఏపీలో కొన్ని చోట్ల ఊద్రిక్తలు, కోర్టుల వల్ల ఎన్నికల సంఘం వాయిదా వేసింది. దీంతో రాష్ట్రంలో ఉన్న 13 మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలతో కలిపి మోత్తం 99 పట్టణ స్థానిక సంస్థలకు రానున్న నెల నవంబర్ 1వ రోజున పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలను ప్రకటించనున్నట్టు తెలిపింది.
Also read: కారు అద్దె బకాయి వివాదంలో దారుణం.. యువకుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు!