E-Paper
Advertisement

Anil Sunkara: సినిమా హిట్టయిన సంతోషం లేదు.. అనిల్ సుంకర షాకింగ్ కామెంట్స్!

Anil Sunkara: సినిమా హిట్టయిన సంతోషం లేదు.. అనిల్ సుంకర షాకింగ్ కామెంట్స్!
Advertisement

Anil Sunkara: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న వారిలో ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత అనిల్ సుంకర (Anil Sunkara)ఒకరు. ఈయన తన బ్యానర్ ద్వారా ఎన్నో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే ఇటీవల ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా వస్తున్న సినిమాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ ద్వారా అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరికెక్కిన ఏజెంట్ (Agent)సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా పూర్తిగా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమా తరువాత ఈ బ్యానర్ పై శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Mira) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సంతోషం వ్యక్తం చేసిన అనిల్ సుంకర..

ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15వ తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ తాజాగా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారు. అలాగే శర్వానంద్ తో తదుపరి సినిమా చేయబోతున్న దర్శకుడు శ్రీనువైట్ల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమా గురించి మాట్లాడుతూ .. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన నారి నారి నడుమ మురారి సినిమా తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.నేడు ఉదయం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోన్ చేసి మరి సినిమా బాగుంది అంటూ ప్రశంసించారని అదే మాకు పెద్ద కాంప్లిమెంట్ అంటూ అనిల్ సుంకర తెలిపారు

సంక్రాంతి బరిలో హిట్ కొట్టిన శర్వానంద్..

Advertisement

నేను నిర్మాతగా వ్యవహరించిన మొదటి మూడు సినిమాలు వరుసగా సక్సెస్ అయ్యాయి. అయితే అప్పుడు కలగని సంతోషం నారి నారి నడుమ మురారి సినిమా సక్సెస్ అవడంతో ఎంతో సంతోషంగా ఉన్నానని తెలియచేశారు. ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం మా అందరికీ ఉంది మా నమ్మకమే నిజమైందని అనిల్ సుంకర ఈ సందర్భంగా తెలియజేశారు. ఫస్ట్ సినిమాలు ఇవ్వని సంతోషం ఈ సినిమా తనకిచ్చిందంటూ ఈయన మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇలాంటి మంచి సక్సెస్ అందించినందుకు డైరెక్టర్ రామ్ అబ్బరాజు శర్వానంద్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

శ్రీ విష్ణు క్యామియో..

Advertisement

శర్వానంద్ సైతం ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఈ సినిమాపైనే శర్వానంద్ ఆశలు పెట్టుకున్నారు. ఊహించని విధంగా ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి స్టార్ హీరోలకు పోటీగా సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో శర్వానంద్ కు జోడీగా ఆశికా రంగనాథ్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ విష్ణు క్యామియో పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.

Also Read: Tamanna bhatia: ఇంటిమేట్ సీన్ చేయాల్సిందే ..తమన్నాను ఇబ్బంది పెట్టిన డైరెక్టర్!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×