E-Paper
Advertisement

Free Bus: ఇక పురుషులకూ ఫ్రీ బస్.. మహిళలకు రూ.2000 వేలు, భలే ఛాన్స్!

Free Bus: ఇక పురుషులకూ ఫ్రీ బస్.. మహిళలకు రూ.2000 వేలు, భలే ఛాన్స్!
Advertisement

AIADMK Manifesto: తమిళనాడులో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల పేరిట వరాలు కురిపిస్తున్నాయి. ఏఐఏడీఎంకే తొలి దశ మేనిఫెస్టోను శనివారం విడుదల చేసింది. ఇందులో మహిళలకు రూ.2,000 ఆర్థికసాయం, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది.

కుల విలక్కు పథకం కింద మహిళలకు ప్రతి నెలకు రూ.2,000 ఆర్థిక సహాయం, సిటీ బస్సుల్లో పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం, అమ్మ ఇల్లం యోజన కింద నిరాశ్రయులకు ఇంటి నిర్మాణం చేస్తామని మేనిఫెస్టోలో తెలిపింది. తమ మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేశామని ఏఐఏడీఎంకే ప్రకటించింది.

ఐదు కీలక హామీలు

Advertisement

అసెంబ్లీ ఎన్నికల తొలి విడత మేనిఫెస్టోలో ఏఐఏడీఎంకే ఐదు కీలక హామీలను ప్రకటించింది.

మహిళలకు రూ.2000

ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కుల విలక్కు పథకం కింద రేషన్ కార్డులున్న మహిళలకు కుటుంబానికి ఒక్కొక్క చొప్పున నెలకు రూ.2,000 అందించనున్నారు. ఈ మొత్తాన్ని మహిళల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం ఆర్థిక సమతుల్యతను తొలగిస్తుందని ఏఐఏడీఎంకే తెలిపింది.

పురుషులకు ఫ్రీ బస్

Advertisement

ప్రస్తుతం మహిళలకు మాత్రమే ఉన్న ఉచిత బస్సు ప్రయాణం ఉండగా..ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఏర్పడితే.. సిటీ బస్సుల్లో ప్రయాణించే పురుషులకు కూడా ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని పేర్కొంది.

అందరికీ ఇండ్లు

అమ్మ ఇల్లం యోజన పథకం కింద… గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని వారికి కాంక్రీట్ ఇండ్లు నిర్మిస్తామని ఏఐఏడీఎంకే హామీ ఇచ్చింది. అదేవిధంగా, పట్టణ ప్రాంతాల్లో సొంత ఇళ్లు లేని వారికి ‘అమ్మ ఇల్లం యోజన’ ద్వారా ఉచితంగా భూమిని కొనుగోలు చేసి అపార్ట్‌మెంట్ ఇళ్లను నిర్మిస్తామని తెలిపింది.

ఉపాధి హామీ పథకం

100 రోజుల ఉపాధి పథకాన్ని 125 రోజులకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల ఈ పథకాన్ని 150 రోజులకు పెంచుతామని ఏఐఏడీఎంకే మేనిఫెస్టోలో పేర్కొంది.

Also Read: తమిళనాడులో రాజకీయాలు పీక్స్.. హింధీ భాష, డీలిమిటేషన్‌లపై ఏకమవుతున్న పార్టీలు

ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ

అమ్మ ద్విచక్ర వాహన పథకం కింద రూ.25,000 సబ్సిడీ అందిస్తామని తెలిపింది. అలాగే 5 లక్షల మంది మహిళలకు అమ్మ ద్విచక్ర వాహనాలు అందిస్తామని మేనిఫెస్టోలో వెల్లడించింది.

Related News

అయోధ్య రామమందిరం కేసులో సంచలనం.. 105 సార్లు విరాళాల చోరీ.. బయటపెట్టిన సిట్!

యువతి యువకుడిపై దాడి.. అసభ్యకరంగా మాటలు, బీహార్‌లో ఘటన, వీడియో వైరల్

చచ్చిపోయిన లండన్‌కు సీఎం విజయ్ ఎందుకు.. మధురై వెళ్లాలని అన్నామలై ఘాటు వ్యాఖ్యలు

భూ కేసులో హేమంత్ సోరెన్‌కు షాక్.. నేడు PMLA కోర్టులో కీలక విచారణ!

రైతులను నెలకు రూ.3 వేలు పెన్షన్.. ఆ స్కీమ్ గురించి తెలుసా, వెంటనే అప్లై చేయండి?

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన

Big Stories

Advertisement
×