E-Paper
Advertisement

Satyadev: ఫరియా అబ్దుల్లాతో సత్యదేవ్.. రామానాయుడు స్టూడియోలో హంగామా!

Satyadev: ఫరియా అబ్దుల్లాతో సత్యదేవ్.. రామానాయుడు స్టూడియోలో హంగామా!
Advertisement

Satyadev: టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev) నూతన చిత్రానికి క్లాప్ పడింది. అన్ని రకాల పాత్రలతో నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ చేస్తునన 15వ చిత్రమిది. త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ స్క్రి‌ప్ట్‌తో.. దర్శకుడు లక్ష్మినారాయణ పుట్టంచెట్టి రూపొందిస్తున్నారు. సత్యదేవ్ సరసన ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో, పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమంలో సత్యదేవ్, ఫరియా హంగామా చేసి ఆహుతుల్ని అలరించారు. ఈ ప్రారంభోత్సవానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో హీరోయిన్లపై అనిల్ రావిపూడి తొలి క్లాప్ ఇచ్చారు. యంగ్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి కెమెరా స్విఛ్ ఆన్ చేయగా, లక్ష్మినారాయణ పుట్టంచెట్టి ఫస్ట్ షాట్‌ను డైరెక్ట్ చేశారు.

Also Read- Jr.NTR -Prashanth Neel: ఇదేందయ్యా ఇదీ.. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు రామ్ చరణ్ డిజాస్టర్ టైటిల్..

త్వరలోనే రెగ్యులర్ షూటింగ్

Advertisement

ఈ సందర్భంగా డైరెక్టర్ లక్ష్మి నారాయణ పుట్టంచెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమా జానర్ ఏంటి? అని అంతా అడుగుతున్నారు. అందరి పెదాలపై నవ్వుల పూయించే ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. రామ్ మిరియాల ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ ఒక కంప్లీట్ మూవీకి రామ్ మిరియాల సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యదేవ్ కెరీర్‌లో ఇదొక పెద్ద హిట్ చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నాము. ఫరియా గ్లామర్ మరో ప్రధాన ఆకర్షణ కానుంది. మాకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. కచ్చితంగా ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అన్నారు.

Also Read- Anushka: నయనతార వల్ల స్టార్ హీరోయిన్ అయిన అనుష్క.. ఇదేం షాక్..!

సత్యదేవ్ ఫస్ట్ టైమ్ అలాంటి పాత్రలో..

Advertisement

అనిల్ రావిపూడి ఈ సినిమా టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సత్యదేవ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ సినిమా ఆయన కెరీర్‌కు ఉపయోగపడాలని కోరారు. మరో అతిథి వంశీ నందిపాటి మాట్లాడుతూ.. నా స్నేహితుడు నరేంద్ర రెడ్డి మరో మంచి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సత్యదేవ్ ఫస్ట్ టైమ్ ఒక ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆయనకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే, ఈ సినిమా స్టోరీ నాకు తెలుసు. సత్యదేవ్ ఫస్ట్ టైమ్ ఇలాంటి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సాధించబోయే విజయం గురించి తర్వాత ముందు ముందు జరిగే ఈవెంట్స్‌లో మాట్లాడతాను. డైరెక్టర్ లక్ష్మినారాయణకు, ఆయన టీమ్‌కు కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. ఈ టీమ్ అందరికీ కంగ్రాట్స్ అని చెప్పుకొచ్చారు. సత్యదేవ్‌తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందని, ప్రస్తుతం రెండు పాటలు కంప్లీట్ చేశామని సంగీత దర్శకుడు రామ్ మిరియాల తెలిపారు.

Also Read- Mammootty: ఆరోగ్య సమస్యలపై తొలిసారి స్పందించిన మెగాస్టార్.. రుచి , వాసన కోల్పోయానంటూ!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×