E-Paper
Advertisement

Tollywood: తెలుగు సినిమాల్లో మారుతున్న ట్రెండ్‌.. స్టార్ హీరోలు ఆ జానర్‌కు దూరం..

Tollywood: తెలుగు సినిమాల్లో మారుతున్న ట్రెండ్‌.. స్టార్ హీరోలు ఆ జానర్‌కు దూరం..
Advertisement

Tollywood: ఇటీవల కాలంలో తెలుగు సినిమా రంగాన్ని గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రముఖ హీరోల నుంచి పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్ సినిమాలు త్వరలో రావడం కాస్త కష్టమే అనిపిస్తోంది. టాప్‌ ఆరు హీరోలను పక్కన పెడితే, మిగతా హీరోలు కూడా వినోదానికి ప్రాధాన్యం ఇచ్చే కథలకంటే భారీ కాన్వాస్‌, సీరియస్‌ టోన్‌ ఉన్న సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇటీవల హాయ్‌ నాన్న తర్వాత నాని వరుసగా యాక్షన్‌ నేపథ్యంతో ఉన్న సినిమాలనే చేస్తున్నారు. దసరా, సరిపోదా శనివారం తరహా సినిమాల తర్వాత ఇప్పుడు ది ప్యారడైజ్ కూడా అదే బాటలో ఉంది. ఈ సినిమాల్లో కథ, భావోద్వేగాలు బలంగా ఉన్నా, పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రం తక్కువగానే ఉంది. ఇక సుజీత్ తెరకెక్కిస్తున్న బ్లడీ రోమియోలో ఎంతవరకు కామెడీ ఉంటుందో చూడాలి.

Advertisement

మరోవైపు విజయ్ దేవరకొండ పూర్తిగా వేరే ట్రాక్‌లో నడుస్తున్నారు. ఆయన చేస్తున్న సినిమాలు ఎక్కువగా ‘లార్జర్ దాన్ లైఫ్’ పాత్రలు, రక్షకుడిలా కనిపించే క్యారెక్టర్లతో ఉన్నాయి. ఈ తరహా సినిమాల్లో యాక్షన్‌, ఇంటెన్స్‌ డ్రామా ఎక్కువగా ఉంటోంది కానీ సరదా ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రం తక్కువగా కనిపిస్తోంది.

ఇక నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, రామ్ పోతినేని కూడా భారీ స్థాయి సినిమాలనే ఎంచుకుంటున్నారు. పెద్ద బడ్జెట్‌, భారీ విజువల్స్‌, సీరియస్‌ కథలతో కూడిన సినిమాలే ఎక్కువగా ప్లాన్‌ చేస్తున్నారు. ఇవి మార్కెట్‌కు ఉపయోగపడినా, కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన లైట్‌ హార్ట్‌డ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రం తగ్గుతోంది.

Advertisement

ఈ పరిస్థితిలో ఒక రకంగా అనిల్ రావిపూడికు లాభం కలుగుతోంది. ప్రతి సంక్రాంతికి ఆయన తీసుకొచ్చే సినిమాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పెద్ద హీరోలతో అయినా సరే, వినోదానికి ప్రాధాన్యం ఇచ్చే సినిమాలు ఇప్పటికీ ఆయన దగ్గర నుంచే వస్తున్నాయనే అభిప్రాయం బలపడుతోంది.

ALSO READ: Anushka: నయనతార వల్ల స్టార్ హీరోయిన్ అయిన అనుష్క.. ఇదేం షాక్..!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×