E-Paper
Advertisement

Lawrence Bishnoi Gang: బాలీవుడ్ లో వరుస బెదిరింపులు.. రోహిత్ శెట్టి కేసులో బయటపడ్డ నిజాలు!

Lawrence Bishnoi Gang: బాలీవుడ్ లో వరుస బెదిరింపులు.. రోహిత్ శెట్టి కేసులో బయటపడ్డ నిజాలు!
Advertisement

Lawrence Bishnoi Gang: బాలీవుడ్లో గత కొన్ని నెలలుగా స్టార్ సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే హత్య చేస్తామని బెదిరించడమే కాకుండా డైరెక్ట్ గా ఆ సెలబ్రిటీల ఇళ్ళను టార్గెట్గా చేసుకొని కాల్పులు కూడా జరుపుతున్నారు.. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి బయట దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అంతేకాదు సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామంటూ హత్యా బెదిరింపులు కూడా గత కొన్ని సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి.

రోహిత్ శెట్టి ఇంటిపై ఐదు రౌండ్లు కాల్పులు..

దీనికి తోడు ఇప్పుడు బాలీవుడ్ లో బడా స్టార్లుగా పేరు దక్కించుకున్న అమీర్ ఖాన్ (Aamir Khan), షారుక్ ఖాన్(Shah Rukh Khan), రణవీర్ సింగ్ (Ranveer Singh) లాంటి హీరోలకి కూడా ఈ హత్య బెదిరింపు కాల్స్ రావడం ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. దీనికి తోడు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి(Rohith Shetty) నివాసంపై ఏకంగా కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇలా బిష్ణోయ్ వర్గం ఏకంగా బాలీవుడ్ బడా స్టార్లను టార్గెట్ గా చేసుకొని ఈ కాల్పులు జరుపుతూ ఉండడం అందరిలో అనుమానాలు రేకెత్తుతోంది. ముఖ్యంగా 1 ఫిబ్రవరి 2026 తెల్లవారుజామున ముంబైలోని జుహూలో రోహిత్ శెట్టి నివాసం పై దుండగులు 5 రౌండ్లు కాల్పులు జరిపారు . ఈ కేసును సీరియస్గా తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటివరకు మొత్తం 12 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

కేసు విచారణలో బయటపడ్డ నిజాలు..

Advertisement

వీరిలో ఆగ్రాకు చెందిన ప్రధాన షూటర్ దీపక్ శర్మతో పాటు హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో నిర్వహించిన మెరుపు దాడుల్లో మరో ఆరు మందిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దాడి వెనుక ఎప్పటిలాగే లారెన్స్ బిష్ణోయ్ ప్రధాన అనుచరుడు శుభం లోంకర్ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో స్పష్టమైంది. మరొకవైపు ఈ కేసులో విచారణ జరిపే కొద్దీ ఊహించని నిజాలు బయటపడుతున్నాయి. అమాయకపు యువతను ఈ నేర ప్రపంచంలోకి లాగడానికి నిందితులు హిందుత్వ భావజాలాన్ని అడ్డం పెట్టుకొని వారి బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా లారెన్స్ బిష్ణోయ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుల అయ్యేలా చేసి యువతను గ్యాంగ్లో చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

యువతను అడ్డం పెట్టుకొని.. సెలబ్రిటీలే టార్గెట్..

పైగా సోషల్ మీడియా వేదికలను వాడుకొని ఆయుధాలతో ఉన్న వీడియోలను పోస్ట్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నట్లు నిజాలు బయటకు వచ్చాయి.. ఇక ఈ కాల్పుల ఘటన కేవలం ట్రైలర్ మాత్రమేనని, భవిష్యత్తులో బెడ్ రూమ్ లోకి బుల్లెట్లు వస్తాయని సోషల్ మీడియా ద్వారా ప్రముఖులను బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. వెంటనే వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అటు సెలబ్రిటీలు కూడా వాపోతున్నారు. ఇక ఈ వ్యవస్థీకృత నేరాన్ని అదుపు చేయడానికి పోలీసులు నిందితులపై కఠినమైన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం శుభం లోంకర్ పరారీలో ఉండగా అతని కోసం గాలింపులు చేపట్టారు. ఏది ఏమైనా యువతను టార్గెట్గా చేసుకొని బిష్ణోయ్ వర్గం ఇలాంటి వికృతి చర్యలకు పాల్పడడం నిజంగా భయాందోళన కలిగిస్తోందని అటు ప్రజలు కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

 

also read: Crazy Kalyanam Film: క్రేజీ కళ్యాణం నుండి అనుపమ ఫస్ట్ లుక్.. బర్తడే స్పెషల్ ట్రీట్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×