E-Paper
Advertisement

Nidhhi Agerwal : నిధి అగర్వాల్ మీద పడిన అభిమానులు.. రాజా సాబ్ ఈవెంట్ లో చేదు అనుభవం

Nidhhi Agerwal : నిధి అగర్వాల్ మీద పడిన అభిమానులు.. రాజా సాబ్ ఈవెంట్ లో చేదు అనుభవం
Advertisement

Nidhhi Agerwal : నిధి అగర్వాల్ నటించిన సవ్యసాచి మిస్టర్ మజ్ను సినిమాలో ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. కానీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. ఆ సినిమా తర్వాత మళ్లీ పూరి జగన్నాథ్ కు ఊహించని స్థాయి సక్సెస్ఫుల్ సినిమా రాలేదు. మరోవైపు రాం పోతినేనికి కూడా ఊహించని సక్సెస్ రాలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్లు పరంగా ఊహించిన రేంజ్ అందుకోలేకపోయింది.

ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిధి అగర్వాల్ టాప్ హీరోయిన్ అయిపోయింది అని చెప్పాలి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో కనిపించింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు విడుదలైన సెకండ్ సింగిల్ ప్రభాస్ మరియు నిధి అగర్వాల్ మధ్యనే ఉంటుంది. సాంగ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది.

నిధి అగర్వాల్ తో అలాంటి ప్రవర్తన

Advertisement

ఇకపోతే ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ నేడు లులు మాల్ లో జరిగింది. ఇక ఒక మాల్ లో ఈవెంట్ జరుగుతుంది అంటే పెద్ద ఎత్తున అభిమానులు రావడం అనేది సహజంగానే జరుగుతుంది. అయితే అత్యుత్సాహం కొద్దీ నిధి అగర్వాల్ మీద చాలా మంది అభిమానులు పడిపోయే ప్రయత్నం చేశారు. సాంగ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత కారు వరకు వెళ్లడానికి విపరీతంగా ఇబ్బంది పడిపోయింది నిధి అగర్వాల్.

ఇక రీసెంట్ గా ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోటో కోసం ఎగబడుతూ నిధి అగర్వాల్ ను చాలా ఇబ్బంది పెట్టేశారు. కారు ఎక్కే వరకు దాదాపు కొద్దిపాటి నరకాన్ని చూసింది నిధి అగర్వాల్. తన ఫేసులో కూడా ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని క్లియర్ గా అర్థమవుతున్నాయి.

అభిమానుల్లో మార్పు రావాలి 

Advertisement

ఒక సెలబ్రిటీ మీద అభిమానం ఉండటం అనేది కామన్ గానే జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో కామన్ సెన్స్ కూడా ఉపయోగించాలి. అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదు. దాని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే నిధి అగర్వాల్ విషయంలో ఎవరికైనా జాలి కలగడం కామన్ గా జరుగుతుంది.

Also Read: Kichcha Sudeep : కిచ్చా సుదీప్ ఇన్స్పిరేషనల్ ఇండస్ట్రీ జర్నీ, బాబోయ్ ఇంత స్ట్రగుల్ చూసాడా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×