E-Paper
Advertisement

Kichcha Sudeep : కిచ్చా సుదీప్ ఇన్స్పిరేషనల్ ఇండస్ట్రీ జర్నీ, బాబోయ్ ఇంత స్ట్రగుల్ చూసాడా?

Kichcha Sudeep : కిచ్చా సుదీప్ ఇన్స్పిరేషనల్ ఇండస్ట్రీ జర్నీ, బాబోయ్ ఇంత స్ట్రగుల్ చూసాడా?
Advertisement

Kichcha Sudeep : సినిమా పరిశ్రమ అంటేనే రంగులు ప్రపంచం. కానీ ఆ రంగుల ప్రపంచం వెనక ఎన్నో కనిపించని కష్టాల ఒడిదుడుకులు ఉంటాయి. కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో తన పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈగ సినిమాకి ముందే అతను సినిమాలు కొంతమేరకు బాగా పాపులర్ అయ్యాయి. ఈగ సినిమాతో నెక్స్ట్ లెవెల్ గుర్తింపు అనేది లభించింది.

ప్రస్తుతం కిచ్చా సుదీప్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు వెతుక్కుని మరి చూస్తుంటారు. ఇక ప్రస్తుతం సుదీప్ మార్క్ అనే సినిమా చేస్తున్న సంగతే తెలిసింది ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు. ఇక రీసెంట్ గా ఒక తమిళ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఇండస్ట్రీ స్ట్రగులింగ్ జర్నీ గురించి ఆసక్తికరంగా తెలిపారు.

ఇంత స్ట్రగుల్ చూసాడా? 

Advertisement

మామూలుగా చాలా సందర్భాలలో ఒక సినిమా మొదలై ఆగిపోతే కొంతమంది నిరుత్సాహపడి పోతారు. అక్కడితో జీవితం అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడు ఇండస్ట్రీలో మనం మాట్లాడుకుంటున్న చాలామంది స్టార్లు, హీరోలు ప్రయాణంలో కూడా ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి. అలా సుదీప్ విషయానికొస్తే ఇవి నెక్స్ట్ లెవెల్ అని అర్థమవుతుంది.

సుదీప్ చేసిన మొదటి సినిమా అసలు పూర్తికాలేదు మధ్యలోనే ఆగిపోయింది. అతను చేసిన రెండవ సినిమా పూర్తి అయిపోయినా కూడా రిలీజ్ కాలేదు. అతను చేసిన మూడువ సినిమా పూర్తి విడుదలైనా కూడా ఆడియన్స్ రాలేదు. ఆ సినిమాకి కేవలం అక్కడ కార్నర్ సీట్లు మాత్రమే ఫీల్ అయ్యాయి. అది ఒక పార్కు లాగా.

Advertisement

మొత్తానికి తమిళ్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన సేతు సినిమా రీమేక్ అతనికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమాను కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోలు రిజెక్ట్ చేసిన తర్వాత సుదీప్ కి ఆ సినిమా చేసే అవకాశం లభించింది. మొత్తానికి ఆ సినిమాతో నాకు బ్రేక్ వచ్చింది. సినిమా నాకు ఎవ్రీథింగ్ అని చెప్పాడు సుదీప్.

ఇన్స్పిరేషనల్ జర్నీ 

సుదీప్ చెప్పిన ఈ బ్యాక్ స్టోర్ ఏమేమిటంటే చాలామందికి ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. ఈ కాలంలో కొంతమంది ఒక ప్రాజెక్ట్ ఆగిపోతేనే లైఫ్ మీద ఒక అసహనం ఫీలై తీవ్రమైన డెసిషన్లు తీసుకుంటున్నారు. గతంలో చాలామంది ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి నేడు మంచి స్థాయిలో ఉన్నారు.

మరోవైపు సేతు సినిమా అప్పుడు కూడా 4వ రోజు మూడవ ఫ్లోర్ నుంచి సుదీప్ కింద పడిపోయారట. అప్పుడు చెట్లకు తగిలి పడిపోవటం వలన తన కాళ్లు మాత్రం దెబ్బతిన్నాయి అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలను రివిల్ చేశాడు సుదీప్.

Also Read: Bigg Boss 9 Telugu : నాలుగైదు వారాల్లో బ్యాగు సర్దుకుని వచ్చేస్తావు అనుకున్న , సంజనా తో ఆది పినిశెట్టి వైఫ్

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×