E-Paper
Advertisement

సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లి సినిమాలో మరో స్టార్… గట్టిగానే ప్లాన్ చేస్తున్న డైరెక్టర్!

సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లి సినిమాలో మరో స్టార్… గట్టిగానే ప్లాన్ చేస్తున్న డైరెక్టర్!
Advertisement

Salmankhan Vamsi Paidipalli: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన వంశీ పైడిపల్లి (Vamsi Paidipalli)ప్రస్తుతం ఇతర భాష హీరోలతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసినదే. ప్రస్తుతం ఈయన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .గత కొంతకాలంగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సల్మాన్ ఖాన్ జోడిగా నయనతార..

ఈ సినిమా ఏప్రిల్ నెల నుంచి షూటింగ్ పనులను జరుపుకుంటుంది అంటూ ఇదివరకు చిత్ర నిర్మాతలు వెల్లడించారు అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్క వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో లేడీస్ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించబోతున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారకంగా తెలియజేశారు. ఇలా సల్మాన్ ఖాన్ నయనతార కాంబినేషన్లో సినిమా అంటేనే భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో మరో సౌత్ ఇండియన్ సీనియర్ స్టార్ హీరో కనిపించబోతున్నట్టు సమాచారం.

Advertisement

కీలక పాత్రలో అరవింద్ స్వామి..

సౌత్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అరవింద్ స్వామి (Aravind Swamy)ఒకరు. ఇటీవల కాలంలో ఈయన సినిమాలను పూర్తిగా తగ్గించారు. కేవలం కీలక ప్రాధాన్యత ఉన్న సినిమాలలో, విలన్ పాత్రలలోను నటిస్తూ అప్పుడప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ధ్రువ సినిమాతో విలన్ గా తన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించిన అరవింద్ స్వామి ఈసారి సల్మాన్ ఖాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ఈయన విలన్ పాత్రలో కాకుండా కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.

Advertisement

సల్మాన్ ఖాన్ విలన్ గా అనిల్ కపూర్?

ఈ సినిమా కథ మొత్తం అరవింద్ స్వామి పాత్ర ద్వారా కీలక మలుపు తిరగబోతుందని అలాంటి ఒక ముఖ్యమైన పాత్రలో అరవింద్ స్వామి నటించబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ సినిమాలో అరవింద్ స్వామి నటించబోతున్నారని వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్రబృతం స్పందించాల్సి ఉంది. ఇక ఇందులో అనిల్ కపూర్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా వంశీ పైడిపల్లి స్టార్ సెలబ్రిటీలు అందరినీ ఈ సినిమాలో భాగం చేయబోతున్నారని తెలుస్తోంది.ఇలా ఈ సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంత నిజం ఉంది అనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Also Read: పేరుకే గ్లోబల్ స్టార్…ఆ పని మాత్రం తెలీదా… చరణ్ గుట్టు బయటపెట్టిన నిహారిక!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×