E-Paper
Advertisement

బీఆర్ఎస్ భవన్‌లో కొత్త చర్చ కలకలం.. గులాబీ పార్టీని నడిపించేదెవరు..?

బీఆర్ఎస్ భవన్‌లో కొత్త చర్చ కలకలం.. గులాబీ పార్టీని నడిపించేదెవరు..?
Advertisement

BRS Leadership: స్వేచ్ఛ బ్యూరో: గులాబీ పార్టీపై ఆసక్తికర చర్చనడుస్తోంది. వారం రోజులపాటు కేటీఆర్ ఫారిన్ టూర్ వెళ్లడంతో పార్టీని అప్పటివరకు ఎవరు నడుపుతారనేది రాజకీయ వర్గాలతో పాటు బీఆర్ఎస్ నేతల్లోనే చర్చకు దారితీసింది. కేటీఆర్ అక్కడి నుంచే నేతలకు దిశానిర్దేశం చేసి పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు ఇస్తారా? లేకుంటే కేసీఆర్ ఎర్రవెల్లి నుంచి భవన్ వర్గాలకు సూచనలు చేస్తూ నిత్యం ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు వెళ్లేలా, పార్టీ లైవ్ లో ఉండేలా ప్రెస్ మీట్లు పెట్టాలని ఆదేశాలు ఇస్తారా? అనే చర్చజరుగుతుంది.

పార్టీని మానిటరింగ్ చేసేదెవరు..?

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. ఆయనే పార్టీ కార్యక్రమాలపై నేతలను గైడ్ చేస్తున్నారు. ఎవరు ఎప్పుడు మాట్లాడాలి.. ప్రభుత్వంపై అంశాల వారీగా ఎవరు మాట్లాడితే బాగుంటుందనేది నిత్యం మానిటరింగ్ చేసేవారు. లేకుంటే ఏకంగా కేటీఆర్ రంగంలోకి దిగి ప్రభుత్వ వైఫల్యాలపై మీడియా వేదికగా మాట్లాడేవారు. అయితే ఆయన వారం రోజుల టూరుకు అమెరికాకు వెళ్లారు. అయితే ఇప్పుడు పార్టీని అక్కడి నుంచే మానిటరింగ్ చేస్తారా? అనేది ఇప్పుడు చర్చకుదారితీసింది. అలా చేస్తే ఆయన టూరుకు వెళ్లినా ఫలితం ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఎవరు ఈ వారం రోజులు పార్టీని మానిటరింగ్ చేసి ప్రభుత్వ వైఫల్యాలపై నేతలతో పార్టీ వాయిస్ వినిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఎర్రవెల్లిలో కేసీఆర్..

Advertisement

కేసీఆర్ ఎర్రవెల్లి నివాసానికే పరిమితం అయ్యారు. పార్టీని మొత్తం కేటీఆర్ కు అప్పగించారు. కేసులు, విచారణలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మాత్రం కేటీఆర్ తో పాటు హరీష్ రావు ముఖ్య నేతలు ఎర్రవెల్లికి వెళ్లి భేటీ అవుతున్నారు. సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత పార్టీ వ్యవహారాలు అన్నీ కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు కేటీఆర్ అందుబాటులో లేకపోవడం, కేసీఆర్ ఎర్రవెల్లిలో ఉండటంతో పార్టీని మానిటరింగ్ ను పార్టీ అధినేత చేస్తారా? అనేది చర్చజరుగుతుంది. ఇప్పటికే భవన్ లో ఎవరు మాట్లాడాలి.. అనేది డైరెక్షన్ ఇస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా భవన్ కు ఎవరు వస్తున్నారు.. యాక్టీవ్ గా ఉన్న నేతలు ఎవరని కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. దాని ప్రకారమే రాబోయే కాలంలో ఆ నేతలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతుంది.

Also read: వీకెండ్ మస్త్ మజా.. డ్రగ్స్ నిషా.. చేవెల్లలో అక్రమ ఫామ్ హౌస్‌ల హల్చల్..!

బాధ్యతలు అప్పగిస్తారా?

Advertisement

మాజీ మంత్రి హరీష్ రావు సైతం యాక్టీవ్ గా పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజాసమస్యలపై గళమెత్తుతున్నారు. ప్రభుత్వం చేపట్టేబోయే కార్యక్రమాల్లో తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నారు. అయితే సీనియర్ అయినప్పటికీ పార్టీలో పదవి లేదు. కానీ నేతలతో పాటు కార్యక్రమాల మానిటరింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. హరీష్ రావుకు రాజకీయ చతురత ఉండటం, సమాజంపై అవగాహన ఉండటంతో పక్కా ప్రణాళికలతో ప్రభుత్వంపై ముందుకు సాగుతున్నారు. అయితే ప్రస్తుతం కేటీఆర్ ఫారిన్ టూర్ లో ఉండటంతో పార్టీ మానిటరింగ్ బాధ్యతలు అప్పగిస్తారా? లేదా? అనే చర్చజరుగుతుంది. లేకుంటే కేసీఆర్ పర్యవేక్షణ చేసి ప్రభుత్వ తప్పిదాలపై కౌంటర్లు ఇవ్వాలని నేతలకు ఆదేశాలు ఇస్తారా? అనేది చూడాలి.

విమర్శలకు దారి..

ఇప్పటికే పార్టీపై దృష్టిసారించడం లేదని, కమిటీలను వేయడం లేదని సొంతపార్టీ నేతల్లోనే నైరాశ్యం నెలకొంది. పార్టీ అధినేత సైతం పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటం.. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో కార్యచరణ ఇంకా ప్రారంభం కాకపోవడంతో కొంత స్తబ్దత నెలకొంది. కేసీఆర్ సైతం సమావేశాలు నిర్వహించకపోవడం, పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేయకపోవడం, కనీసం పార్టీలో ఏం జరుగుతుందోనని తెలుసుకొని సరిదిద్దకపోవడంతో విమర్శలకు దారితీస్తుంది. కేవలం ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేక వస్తుందని వేచిచూసే ధోరణిలో మాత్రమే బీఆర్ఎస్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అదే కలిసి వస్తుందని ధీమాతో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. అందుకే పార్టీపై ఫోకస్ పెట్టడం లేదని.. కేవలం ఎన్నికలకు 6నెలల ముందు ప్రజల్లోకి వెళ్తే సరిపోతుందని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రజల్లోకి ఉండాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది.

Also Read: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. విశాఖకు భారీ LPG నౌక.. గ్యాస్ కష్టాల నుంచి ఊరట

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×