E-Paper
Advertisement

Kavitha : బీఆర్ఎస్ భుజం మీద కాంగ్రెస్ తుపాకీ..ఇదెక్కడి విడ్డూరం!

Kavitha : బీఆర్ఎస్ భుజం మీద కాంగ్రెస్ తుపాకీ..ఇదెక్కడి విడ్డూరం!
Advertisement

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, నేతల స్టేట్మెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఏ నినాదం వెనుక ఏ రాజకీయ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత వరకు ప్రజలను రాజకీయనేతలు పిచ్చోళ్లను చేస్తారనే విషయాన్ని ఆమె బలంగా తీసుకెళ్తున్నారు.మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆమె.. ఇప్పుడు తనకంటూ ఓ రాజకీయ ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసుకోవాలని తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికారం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా కీలక అంశాలపై ఇరు పార్టీల తీరును ఎండగడుతున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను గుర్తుచేస్తూనే ప్రస్తుత ప్రభుత్వం అలా చేయకూడాదని చెబుతున్నారు. అంతటితో ఆగకుండా ప్రజాసమస్యలపై తనదైన శైలిలో బలమైన వాయిస్ వినిపిస్తున్నారు.

ఎత్తడం కాదు. తొక్కడమే పాలిటిక్స్

రాజకీయాల్లో ఎత్తడమూ ఉంటుంది. తొక్కడమూ ఉంటుంది. ఈ కామన్ లాజిక్ తెలియకుండా రాజకీయాల్లో గుడ్డిగా ముందుకు వెళ్తామంటే కుదరదు. అలాంటి వారు వెనక్కి తప్పా.. ముందుకు వెళ్లడం కష్టమే. అందుకే అవకాశం వచ్చిందా? మన ముందు ఉన్నవారిని మెల్లిగా సైడ్‌కు తప్పించి.. అతని స్థానంలో మనం నిలబడటమే రాజకీయం.ఈ లాజిక్‌ను రాష్ట్రంలోని కొందరు నాయకులు వంటబట్టించుకున్నారు. అందుకే వారిపై ప్రభుత్వం లోని పెద్దలు నిత్యం ఓ నిఘా ఉంచుతారని తెలుస్తోంది. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వంలోనూ అదే జరుగుతున్నదని ప్రచారం జరుగుతోంది. అందుకే అసెంబ్లీలో మంత్రి పొంగులేటి అంశాన్ని కావాలని తెరమీదకు తెచ్చారని మాజీ ఎమ్మెల్సీ కవిత పేర్కొనడం గమనార్హం.

అక్రమ మైనింగ్ వైరల్ ఎలా?

Advertisement

అసెంబ్లీలో చర్చ సందర్బంగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారీగా అక్రమ మైనింగ్ చేస్తున్నారని, సహజ వనరులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు.అంతేకాకుండా, దీనిపై విచారణ కోసం హౌస్ కమిటీ వేయాలని.. పొంగులేటిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వారితో పాటే బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. హౌస్ కమిటీ కాకపోతే సిట్టింగ్ జడ్జితో అయినా విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కలుగజేసుకుని.. ‘మీరు చెబితే మేం చేయాలా? మీరు చెప్పింది వినకపోతే రాజీనామా చేయాలని పట్టు బడతారా? బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడతారా? ఇక్కడున్నది రేవంత్ రెడ్డి.. మీ పప్పులు ఉడకవ్’ అంటూ వ్యాఖ్యానించారు. అసలు రాఘవ కన్ స్ట్రక్షన్‌కు మంత్రి పొంగులేటికి సంబంధం ఏంటని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్తగా 2 లక్షల పెన్షన్లు! గ్రామసభల ద్వారా

Advertisement

మంత్రి పొంగులేటిని కేబినెట్ నుంచి తప్పించాలని కేటీఆర్, హరీశ్ రావు అసెంబ్లీలో డిమాండ్ చేయడం.. దానికి రేవంత్ చెప్పిన సమాధానంపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాస్త డిఫరెంట్‌గా స్పందించారు. బీఆర్ఎస్ నేతల భుజాల మీద తుపాకీ పెట్టి సీఎం రేవంత్ రెడ్డే.. మంత్రి పొంగులేటిని కాల్చారని ఆరోపించారు. ఎందుకంటే రాష్ట్రంలో కొందరు మంత్రులు సీఎం మాటను పెడచెవిన పెట్టి అక్రమాలకు పాల్పడుతున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలుస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ నివేదికలు తెప్పించుకుంటున్నట్టు సమాచారం. పొంగులేటి రాష్ట్ర కేబినెట్‌లో కీలకనేత. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్విప్ చేసిందంటే డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి చలవే.అందుకే సీఎం రేవంత్ నేరుగా ఆయనపై విమర్శలు చేయకుండా ఇలా బీఆర్ఎస్ నేతల ద్వారా బర్తరఫ్ టాపిక్ తీసుకొచ్చారని కవిత ఆరోపించారు. త్వరలో కేబినెట్ విస్తరణ ఉన్నందున పలువురికి ప్రమోషన్.. ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులకు డిమోషన్ ఇవ్వాలని సీఎం రేవంత్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అక్రమాలకు పాల్పడితే మంత్రులు ఎవరైనా కేబినెట్ నుంచి తొలగిస్తాననే సంకేతాలను సీఎం రేవంత్.. ఇరత పార్టీల ద్వారా పరోక్షంగా చెప్పిస్తున్నారని కవిత ఆరోపించినట్టు టాక్. కాగా, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related News

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

Big Stories

Advertisement
×