E-Paper
Advertisement

Seyon First Look: శివకార్తికేయన్‌తో కమల్ హాసన్ నిర్మిస్తోన్న చిత్ర టైటిల్ ఇదే.. ఫస్ట్ లుక్ అదిరింది మామా!

Seyon First Look: శివకార్తికేయన్‌తో కమల్ హాసన్ నిర్మిస్తోన్న చిత్ర టైటిల్ ఇదే.. ఫస్ట్ లుక్ అదిరింది మామా!
Advertisement

Seyon First Look: కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ స్టార్ శివకార్తికేయన్ (Sivakarthikeyan). హిట్టు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తూ.. ఫుల్ జోష్‌లో ఉన్నారు. రీసెంట్‌గా ‘అమరన్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన శివకార్తికేయన్, ఇప్పుడు మళ్ళీ అదే నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌ (RKFI) తో చేతులు కలిపారు. శివకుమార్ మురుగేశన్ (Sivakumar Murugesan) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘సెయాన్’ (Seyon) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్‌ (Seyon First Look)ను విడుదల చేశారు. దర్శకుడు శివకుమార్ మురుగేశన్ ఈ చిత్రాన్ని ఒక గ్రాండ్ రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారనే విషయం ఈ ఫస్ట్ లుక్ తెలియజేస్తుంది. కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. 2026లో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ (Kamal Haasan), ఆర్. మహేంద్రన్ అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు.

Also Read- Maa Oori Baavi: ‘మా ఊరి బావి’ చిత్రంలో విలన్‌గా ఆర్జీవీ ‘కుకీ’! ఎవరో తెలుసా?

మురుగన్ అవతారంలో శివకార్తికేయన్!

Advertisement

ఇక మేకర్స్ వదిలిన ఫస్ట్ లుక్ ఎలా ఉందంటే.. శివకార్తికేయన్ మునుపెన్నడూ లేని విధంగా ఒక డివైన్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా ధోతి కట్టుకుని, నుదుటన విభూతి, మెడలో రుద్రాక్షలతో కనిపిస్తూనే.. చేతిలో పదునైన కత్తి పట్టుకుని ఉన్న తీరు సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది. ముఖ్యంగా పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో నెమలి రెక్కలు, చుట్టూ ఉన్న నెమళ్లు చూస్తుంటే ఈ సినిమాకి మురుగన్ స్వామి థీమ్‌తో ఏదో లోతైన కనెక్షన్ ఉన్నట్లు కనిపిస్తోంది. శాంతంగా కనిపిస్తూనే శత్రు సంహారం చేసే ఒక శక్తివంతమైన పాత్రలో శివకార్తికేయన్ మెరవబోతున్నారనేలా పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌తోనే సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఇంతకు ముందు ఇదే బ్యానర్‌లో సైనికుడిగా కనిపించిన శివకార్తికేయన్, ఈసారి మాత్రం దైవశక్తిని నమ్ముకున్నట్లుగా అర్థమవుతోంది.

Also Read- Actress Trisha: నటి త్రిషకు క్షమాపణలు చెప్పిన బీజేపీ లీడర్..ఆ ఉద్దేశం లేదంటూ!

మరోసారి మ్యాజిక్ చేయడం పక్కా..

Advertisement

ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. సంతోష్ నారాయణన్ సంగీతం. రాజ్‌కమల్ ఫిలిమ్స్, శివకార్తికేయన్, సంతోష్ నారాయణన్ ముగ్గురూ కలిసి పని చేస్తున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. సంతోష్ తన వైవిధ్యమైన మ్యూజిక్ స్టైల్‌తో ‘సెయాన్’ సినిమాకు ప్రాణం పోస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శివకార్తికేయన్ నుంచి వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని చెప్పొచ్చు. ఇక ఇందులో నటించే హీరోయిన్ ఎవరనేది మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు. త్వరలోనే ఈ చిత్రంలోని మిగిలిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ లెగసీ, టర్మరిక్ మీడియా (Turmeric Media) విజన్ కలిసి నిర్మిస్తోన్న ఈ ‘సెయాన్’ చిత్రం.. 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటని చెప్పుకోవచ్చు.

Also Read- Shrasti Verma: ‘న్యాయం చేయరా దేవుడా..’ అంటోన్న శ్రష్టి వర్మ.. మ్యాటరేంటో తెలుసా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×