E-Paper
Advertisement

Maa Oori Baavi: ‘మా ఊరి బావి’ చిత్రంలో విలన్‌గా ఆర్జీవీ ‘కుకీ’! ఎవరో తెలుసా?

Maa Oori Baavi: ‘మా ఊరి బావి’ చిత్రంలో విలన్‌గా ఆర్జీవీ ‘కుకీ’! ఎవరో తెలుసా?
Advertisement

Maa Oori Baavi: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో 2022లో వచ్చిన ‘డేంజరస్’ సినిమా గుర్తుందా? ఈ సినిమాలో ‘కుకీ’ అనే పాత్రతో ఒక టాలెంటెడ్ యాక్టర్‌కు వర్మ అవకాశం ఇచ్చారు. ఆ యాక్టర్ ఎవరో కాదు.. గోర్ధన్ సింగ్. ఆ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన గోర్ధన్ సింగ్ (Gordhan Singh).. ఆ తర్వాత హిందీ, తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ బిజీ నటుడిగా మారారు. ‘డేంజరస్’ సినిమాలో గోర్ధన్ సింగ్ పోషించిన ‘కుకీ’ పాత్రకు మంచి స్పందన రావడంతో.. అతను మళ్లీ వెనుదిరిగి చూసుకోకుండా వరస అవకాశాలతో దూసుకెళుతున్నాడు. ఇప్పుడు గోర్ధన్ సింగ్ తెలుగు హారర్ డ్రామా చిత్రంలో విలన్‌గా చేసేందుకు ఓకే చెప్పారు. ఆ వివరాలను తెలుపుతూ అధికారికంగా మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..

Also Read- Mani Ratnam: పెద్ద తెరపైనే చూడాలి.. సర్వైవల్ థ్రిల్లర్‌ చిత్రం చూసి దిగ్గజ దర్శకుడు ఫిదా!

‘మా ఊరి బావి’లో విలన్‌గా..

Advertisement

గోర్ధన్ సింగ్ ప్రధాన విలన్‌గా నటిస్తున్న తెలుగు హారర్ డ్రామా చిత్రం ‘మా ఊరి బావి’ (Maa Oori Baavi). ఈ సినిమాను ప్రమోద్ కులకర్ణి నిర్మిస్తుండగా, శశాంక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్‌ను 2025 నవంబర్‌లో గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ భారతీయ చిత్రోత్సవం (IFFI)లో NFDC విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదేకాకుండా, రాబోయే హిందీ సినిమా ‘దుల్హనియాన్ లే అ ఎంగే (2026)’లో మహేష్ మంజ్రేకర్, పీయూష్ మిశ్రా, ఓంకార్ కపూర్లతో కలిసి గోర్ధన్ సింగ్ నటించారు. ప్రస్తుతం తెలుగులో ఆయన చేస్తున్న మరో థ్రిల్లర్ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని మేకర్స్ తెలుపుతున్నారు. వరుస అవకాశాలతో బిజీ బిజీగా ఉన్న గోర్ధన్ సింగ్ ‘మా ఊరి బావి’ సినిమా తర్వాత టాలీవుడ్‌లోనూ బిజీ విలన్‌గా మారతాడంటూ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read- Nukaraj – Asiya: నూకరాజ్, ఆసియా పెళ్లి తేదీ ఫిక్స్.. హనీమూన్ అంటూ..

రూ. 300, రెండు సిఫార్సు లేఖలతో

Advertisement

గోర్ధన్ సింగ్ విషయానికి వస్తే.. నటనపై ఉన్న ఆసక్తితో, ఆయన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD), న్యూఢిల్లీలో శిక్షణ పొందారు. ఆయన శిక్షణ ముగిసిన వెంటనే అవకాశాల కోసం ప్రయత్నించారు. అలా రామ్ గోపాల్ వర్మ కంటిలో పడిన గోర్ధన్ సింగ్‌కు, ‘డేంజరస్’లో చోటు దక్కింది. 2025 డిసెంబర్ 11న ఆయన దూరదర్శన్ DD మార్నింగ్ షోలో అతిథిగా పాల్గొని, తన జీవిత ప్రయాణం గురించి వివరంగా చెప్పారు. తన రాబోయే సినిమా ‘మా ఊరి బావి’ని కూడా ఆయన ఈ కార్యక్రమంలో ప్రచారం చేశారు. 14 ఏళ్ల వయసులో కేవలం రూ. 300, రెండు సిఫార్సు లేఖలతో పంజాబ్ నుంచి ముంబైకి వెళ్లారు గోవర్ధన్ సింగ్. సినీ పరిశ్రమలోకి రావడానికి ముందు, ముంబై, గోవా, ఇంకా సముద్ర తీర ప్రాంతాల్లోని ఆఫ్‌షోర్ ప్రదేశాలలో 15 సంవత్సరాలు హాస్పిటాలిటీ రంగంలో ఆయన పనిచేశారు. ‘మా ఊరి బావి’తో పూర్తి స్థాయి విలన్‌గా ఆయన స్థిరపడతారేమో చూద్దాం..

Also Read- Ritu chowdary: శివరాత్రి స్పెషల్.. షాకింగ్ లుక్ లో రీతూ..ఇది అస్సలు ఊహించలేదుగా!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×