RAAKA Movie :‘రాకా’ … బన్నీ, అట్లీ కాంబినేషన్లో వస్తున్న ఈ విజువల్ వండర్ గురించి రోజుకో అప్‌డేట్ మీడియాని షేక్ చేస్తుంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఒక పవర్ ఫుల్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడన్న వార్తలు బయటికి రావడంతో మిక్స్డ్ ఒపీనియన్స్ పాస్ చేస్తున్నారు మూవీ లవర్స్.
‘జవాన్’తో వెయ్యి కోట్ల సినిమా ఇచ్చినందుకే
సినిమాకి బాద్‌షా యాడ్ అయితే నార్త్ బెల్ట్ తో పాటు విదేశాల్లో సినిమాకి కలెక్షన్ల సునామీ పక్కా అని, ఈ దెబ్బకి బన్నీ ఇండియాలో టాప్ గ్రాసర్ గా ప్లేస్ కొట్టేయడం పక్కా అని కొందరు అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం 2023లో షారుక్ కి అట్లీ ‘జవాన్’తో వెయ్యి కోట్ల సినిమా ఇచ్చినందుకే ఇప్పుడు బన్నీ సినిమాలో కనిపించేందుకు ఒప్పుకోవచ్చని నెగెటివ్ కామెంట్స్ వదులుతున్నారు. ఇక మరికొందరైతే ఒక అడుగు ముందుకు వేసి సినిమా కంటెంట్ లో దమ్ము లేకనే అట్లీ ఇలాంటి గిమ్మిక్కులు చేస్తున్నాడేమో అంటూ సెటైర్స్ వేస్తున్నారు.
also read:రామ-లక్ష్మణులు వలస కూలీలా?ప్రకాష్ రాజ్ పై భగ్గుమంటున్న హిందూ సంఘాలు…వారణాసికి బాయ్‌కాట్ సెగ!
‘జవాన్’ సినిమాలో బన్నీ ఒక చిన్న పాత్ర
నిజానికి గతంలో ‘జవాన్’ సినిమాలో బన్నీ ఒక చిన్న పాత్ర చేయాల్సి ఉంది. కాని తనకున్న ఇమేజ్ అందుకు సరిపోదని దాన్ని లైట్ తీసుకున్నాడట. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలోకి షారుఖ్ ఖాన్ లాంటి మెగా స్టార్‌ను తీసుకురావడం ద్వారా, బన్నీ సోలో ఇమేజ్‌ను అట్లీ తగ్గించేస్తున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో వైపు షారుఖ్ ఖాన్ క్రేజ్‌ను వాడుకుని కేవలం నార్త్ ఇండియాలో కలెక్షన్లు రాబట్టాలని చూస్తున్నారే తప్ప, కథపై అట్లీ ఫోకస్ సరిగ్గా పెట్టడం లేదని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.
జైలర్ 2′ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న షారుఖ్
రజినీకాంత్ ‘జైలర్ 2’ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న షారుఖ్, అనూహ్యంగా ‘రాకా’లోకి రావడం వెనుక అట్లీ మార్క్ ఫ్రీ మేక్ కథలే కారణమని తెలుస్తోంది. పోస్టర్ రాగానే మొదలైన కాపీ వివాదాలు ఒకవైపు, ఇప్పుడు షారుఖ్ ఎంట్రీతో సినిమాలోని డొల్లతనాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం మరోవైపు జరుగుతోందని భావిస్తున్నారు ట్రేడ్ పండితులు.బన్నీ మాస్ స్వాగ్‌కు, షారుఖ్ క్లాస్ మేనరిజం తోడైతే థియేటర్లు దద్దరిల్లుతాయని ఫ్యాన్స్ సంబరపడుతున్నా, ట్రేడ్ వర్గాలు మాత్రం ఇది ఒక రిస్కీ స్టంట్ అని వార్నింగ్ ఇస్తున్నాయి. ఇక దీపికా పదుకొణె హీరోయిన్‌గా, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ల జాతర కనిపిస్తున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ పాత్ర కేవలం నిమిషాల వ్యవధిలోనే ఉంటుందని, కేవలం టీజర్ మరియు ట్రైలర్లలో హైప్ పెంచడానికే ఆయనను వాడుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.
బన్నీ సోలో మార్కెట్‌ను పక్కదారి పట్టిస్తుందా
వెయ్యి కోట్లు కాదు కదా.. కనీసం బడ్జెట్ రికవరీ అవ్వడమే కష్టమని, షారుఖ్ ఇమేజ్ ముందు బన్నీ పాత్ర వెలవెలబోయే ప్రమాదం ఉందని టెన్షన్ పడిపోతున్నారు బన్నీ ఫ్యాన్స్. కేవలం అట్లీ మీద ఉన్న గౌరవంతో ఓకే చెప్పిన షారుఖ్ ఖాన్, తన ట్వీట్ల ద్వారా సినిమాకు చేస్తున్న ప్రచారం కేవలం జవాన్ లాంటి వెయ్యి కోట్ల సినిమా ఇచ్చినందుకే తప్ప, అందులో విషయం ఉండి కాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.మరి మీడియాలో చక్కర్లు కొడుతున్నట్టుగా బాద్‌షా ఎంట్రీ ‘రాకా’కు ఊపిరి పోస్తుందా లేక బన్నీ సోలో మార్కెట్‌ను పక్కదారి పట్టిస్తుందా కాలమే డిసైడ్ చేయాలి.
also read:‘మా ఇంటి బంగారం’ నుండి వచ్చేసిన ఫస్ట్ సింగిల్ .. తస్సాదియ్యా అంటున్న సామ్