E-Paper
Advertisement

10 నిమిషాల్లో టేస్టీ ఆలూ జీరా వేపుడు.. అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్!

10 నిమిషాల్లో టేస్టీ ఆలూ జీరా వేపుడు.. అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్!
Advertisement

Aloo Jeera Fry: బంగాళాదుంపతో చేసే వంటకాలంటే ఇష్టపడని వారుండరు. అందులోనూ మరీ ఎక్కువ మసాలాలు లేకుండా, జీలకర్ర మంచి సువాసన ఇస్తూ కరకరలాడే ‘ఆలూ జీరా ఫ్రై’ ఉంటే ఆ మజానే వేరు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ వేపుడుతో తిన్నా, లేదంటే చపాతీలోకి సైడ్ డిష్‌గా నంజుకున్నా దీని రుచి అద్భుతంగా ఉంటుంది. వంటరాని వారు కూడా కేవలం పది నిమిషాల్లో ఎంతో రుచిగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆలూ జీరా ఫ్రై తయారీ విధానం ఎలాగో చూద్దాం రండి..

కావలసిన పదార్థాలు:

బంగాళాదుంపలు – 3 లేదా 4 ( చిన్నగా కట్ చేసుకోవాలి)
జీలకర్ర – ఒక పెద్ద టేబుల్ స్పూన్
నూనె – 2 – 3 టేబుల్ స్పూన్లు
పసుపు – అర టీస్పూన్
కారం – ఒక టీస్పూన్
ధనియాల పొడి – ఒక టీస్పూన్
ఆమ్ చూర్ పౌడర్ – అర టీస్పూన్
ఉప్పు – రుచికి తగినంత
కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా

Advertisement

Also Read: మసాలా దట్టించి వండిన ఈ గుత్తి వంకాయ ముందు చికెన్, మటన్ కూడా బలాదూరే!

తయారీ విధానం ఇలా..

బాగా కడిగి శుభ్రం చేసుకున్న బంగాళాదుంపలను పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక అందులో జీలకర్ర వేసి అది చిటపటలాడే వరకు వేయించాలి. ఈ వంటకానికి జీలకర్ర సువాసనే ప్రధానం. తర్వాత అందులో కరివేపాకు, కోసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసి మధ్యస్థ మంటపై వేయించాలి.

Advertisement

కాసేపటి తర్వాత ముక్కలు కాస్త మెత్తబడి రంగు మారుతున్నప్పుడు పసుపు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ముక్కలు చక్కగా వేగి పైన కరకరలాడుతున్నప్పుడు కారం, ధనియాల పొడి, కొద్దిగా ఆమ్ చూర్ పౌడర్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. మసాలాలన్నీ ముక్కలకు పట్టి మంచి సువాసన వస్తున్నప్పుడు చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ కట్టేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన ఆలూ జీరా ఫ్రై రెడీ అయిపోయినట్టే.

Also Read: ముక్క జ్యూసీగా, గ్రేవీ రుచిగా రావాలంటే చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి!

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×