E-Paper
Advertisement

రూ.40వేల లోపు బెస్ట్ LG ఫ్రిజ్‌లు.. అదిరిపోయే కూలింగ్, భారీగా కరెంటు ఆదా, ఎక్కడంటే?

రూ.40వేల లోపు బెస్ట్ LG ఫ్రిజ్‌లు.. అదిరిపోయే కూలింగ్, భారీగా కరెంటు ఆదా, ఎక్కడంటే?
Advertisement

Best LG Fridges Under 40000: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు ఉన్న బ్రాండెడ్ ఫ్రిజ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకొక గుడ్ న్యూస్. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో LG రిఫ్రిజరేటర్లపై భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రూ.40,000 లోపు బడ్జెట్‌లో లభించే ఈ ఫ్రిజ్‌లు చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాదు.. కరెంటు బిల్లును కూడా భారీగా తగ్గిస్తాయి. ఈ నేపథ్యంలో అమెజాన్‌లో మంచి రేటింగ్ ఉన్న టాప్-5 LG రిఫ్రిజిరేటర్ల గురించి తెలుసుకుందాం..

LG ఫ్రిజ్‌లే ఎందుకు బెటర్?

చాలామంది ధర తక్కువగా ఉంటే క్వాలిటీ కూడా తక్కువగా ఉంటుందని అనుకుంటారు. కానీ LG విషయంలో అది పొరపాటే. ఈ బ్రాండ్ తమ తక్కువ ధర మోడల్స్‌లో కూడా ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీని వాడుతోంది. దీనివల్ల లోపల ఉండే ఆహార పదార్థాలను బట్టి కూలింగ్‌ను ఫ్రిజ్ అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఫలితంగా కరెంటు బిల్లు తక్కువగా వస్తుంది. పైగా వీటికి స్టెబిలైజర్ అవసరం లేదు. వోల్టేజ్ అటు ఇటు అయినా ఫ్రిజ్ సేఫ్‌గా ఉంటుంది. గీతలు పడని బాడీ, ఎక్కువ కాలం మన్నే నమ్మకం వీటి సొంతం.

LG 185 లీటర్ల 5-స్టార్ సింగిల్ డోర్ ఫ్రిజ్:

Advertisement

చిన్న ఫ్యామిలీస్ లేదంటే బ్యాచిలర్స్ కోసం ఇది బాగా సెట్ అవుతుంది. దీనికి 5-స్టార్ రేటింగ్ ఉండటం వల్ల కరెంటు బిల్లు గురించి అస్సలు ఆలోచించక్కర్లేదు. పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు వాడిపోకుండా తాజాగా ఉండేలా దీనిలో మాయిస్ట్ ఎన్ ఫ్రెష్ ఫీచర్ ఇచ్చారు. అలాగే దీనిలో ఉండే స్పెషల్ గ్యాస్కెట్ వల్ల ఫ్రిజ్‌లోకి బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. కింద డ్రాయర్ కూడా ఉంటుంది కాబట్టి.. ఉల్లిపాయలు, బంగాళదుంపలు లాంటివి విడిగా పెట్టుకోవచ్చు.

Also Read: Jio, Airtel వినియోగదారులకు భారీ ఊరట.. కస్టమర్ కేర్ తిప్పలు లేకుండా కేంద్రం కొత్త రూల్స్!

LG 276 లీటర్ల 2-స్టార్ డబుల్ డోర్ కన్వర్టిబుల్ ఫ్రిజ్:

Advertisement

ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉన్న పెద్ద ఫ్యామిలీ అయితే ఈ 276 లీటర్ల ఫ్రిజ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇది ఫ్రాస్ట్ ఫ్రీ మోడల్ కావడంతో ఫ్రీజర్‌లో అనవసరంగా ఐస్ పేరుకుపోయే సమస్య ఉండదు. మల్టీ ఎయిర్ ఫ్లో టెక్నాలజీ వల్ల ఫ్రిజ్‌లో ఎక్కడ పెట్టినా పదార్థాలు సమానంగా కూల్ అవుతాయి. అలాగే ఫ్రిజ్‌లో ఒక్కోసారి వచ్చే బ్యాడ్ స్మెల్‌ను పోగొట్టడానికి దీనిలో మంచి డియోడరైజర్ కూడా ఉంది.

LG 251 లీటర్ల 1-స్టార్ డబుల్‌డోర్ ఫ్రిజ్:

తక్కువ ధరలో పెద్ద ఫ్రిజ్ కావాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్. దీనికి స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ ఉంది. దీంతో కరెంటు పోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంటి ఇన్వర్టర్‌పై ఇది పనిచేస్తుంది. దీనివల్ల లోపల ఉన్న సామాన్లు పాడవుతాయన్న భయం ఉండదు. కూరగాయలు స్టోర్ చేసుకోవడానికి ఈ ప్రిజ్‌లో 25 లీటర్ల పెద్ద బాక్స్ ఇచ్చారు. అలాగే వాతావరణానికి తగ్గట్టుగా కూలింగ్‌ను మార్చుకునే స్మార్ట్ మోడ్ కూడా ఉండటం విశేషం.

LG 201 లీటర్ల 5-స్టార్ సింగిల్ డోర్ ఫ్రిజ్:

ఈ బీజ్ కలర్ ఫ్రిజ్ మీ ఇంటి కిచెన్‌కు కొత్త లుక్‌ను తీసుకొస్తుంది. ఇది చాలా క్లాసీగా, ప్రీమియం లుక్‌తో ఉంటుంది. ఐస్ త్వరగా తయారయ్యే ఫీచర్, సైలెంట్ ఆపరేషన్, ఇన్వర్టర్ సపోర్ట్ వంటి అన్ని మోడ్రన్ ఫీచర్లు దీనిలో ఉన్నాయి. చూడ్డానికి బాగుండాలి, కరెంటు కూడా తక్కువగా కాలాలి అనుకునే వారికి ఇది కరెక్ట్ ఫ్రిజ్. అయితే ఫ్రిజ్ అనేది మనం ఒక్కసారి కొంటే ఏళ్ల తరబడి వాడుకుంటాం. అందుకే బడ్జెట్ చూసుకోవడంతో పాటు దాని పనితీరు కూడా ముఖ్యమే.

Also Read: అబ్బా.. ఏం ఆఫర్ రా బాబు, google pixel 10 ఫోన్ ఇంత తక్కువకా? ఈ బంపర్ ఆఫర్‌ను మిస్ చేసుకోవద్దు!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×