E-Paper
Advertisement

Biker Film: అంచనాలు పెంచుతున్న బైకర్.. తండ్రీకొడుకుల ఎమోషన్ తో!

Biker Film: అంచనాలు పెంచుతున్న బైకర్.. తండ్రీకొడుకుల ఎమోషన్ తో!
Advertisement

Biker film: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న వారిలో యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) ఒకరు. ఇటీవల వరుస సినిమాలకు కమిట్ అయ్యి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా నారీ నారీ నడుమ మురారి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ తిరిగి ఏప్రిల్ మూడో తేదీ బైకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. శర్వానంద్ హీరోగా రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన బైకర్ సినిమా ఏప్రిల్ మూడో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం తెలిపారు.

బైకర్ తో హిట్ కొట్టబోతున్న శర్మ..

ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్లలో భాగంగా సీనియర్ నటుడు రాజశేఖర్ తో పాటు హీరో శర్వానంద్ కూడా ఎంతో బిజీగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇకపోతే ఈ సినిమా రేసింగ్ నేపథ్యంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నప్పటికీ ఈ సినిమా తండ్రీ కొడుకుల మధ్య కొనసాగే ఎమోషనల్ సెంటిమెంటుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సమాచారం. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఏప్రిల్ మూడో తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా ఇతర సినిమాలతో పోటీగా ఉన్నప్పటికీ అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని తెలుస్తోంది.

తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్..

Advertisement

ఏప్రిల్ మూడో తేదీ ఈ సినిమాకు పోటీగా మరికొన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. అదే రోజున నిహారిక నిర్మాతగా సంగీత్ శోభన్ హీరోగా నటించిన రాకాసా సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఇతర సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ బైకర్ హిట్ కొడుతుందని అంచనాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. మరి ఏప్రిల్ మూడో తేదీ విడుదల కాబోతున్న బైకర్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో శర్వానంద్ తండ్రి పాత్రలో సీనియర్ నటుడు రాజశేఖర్ నటించిన విషయం తెలిసిందే. సునీల్ అనే పాత్రలో రాజశేఖర్ నటించబోతున్నారు.

శర్వానంద్ తండ్రిగా రాజశేఖర్..

Advertisement

ఇటీవల రాజశేఖర్ పలు సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు. శర్వానంద్ ఈ సినిమాలో మాత్రమే కాకుండా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న ఎల్లమ్మ సినిమాలో కూడా ఈయన తండ్రిగా కనిపించబోతున్నారని సమాచారం. ఇక త్వరలోనే విడుదల కాబోతున్న బైకర్ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు అభిలాష రెడ్డి కంకర దర్శకత్వం వహించగా యు.వి క్రియేషన్ బ్యానర్ పై ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో నటిగా మాళవిక నాయర్ నటించి సందడి చేశారు. ఇలా రేసింగ్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతున్నప్పటికీ ఇందులో తండ్రీ కొడుకుల మధ్య చాలా ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తుంది.

Also Read: Raashii Khanna: పెళ్లి పై రాశి ఖన్నా కామెంట్స్.. పెళ్లెప్పుడో చెప్పిన ముద్దుగుమ్మ?

Related News

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

హార్ట్ టచ్ ఫీలింగ్.. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్!

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

Big Stories

Advertisement
×