E-Paper
Advertisement

Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్ లో శర్వానంద్.. అసలు విషయం బయటపెట్టిన హీరో!

Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్ లో శర్వానంద్.. అసలు విషయం బయటపెట్టిన హీరో!
Advertisement

Sharwanand: శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈయన నారీ నారీ నడుమ మురారి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో శర్వానంద్ మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అభిలాష రెడ్డి కంకర దర్శకత్వంలో శర్వానంద్ (Sharwanand)మాళవిక హీరో హీరోయిన్లుగా నటించిన బైకర్ సినిమా(Biker Film) ఏప్రిల్ మూడో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రేసింగ్ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రేసర్ గా శర్వానంద్..

ఈ సినిమాలో శర్వానంద్ రేసర్ గా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ మూడో తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు అయితే ఈ కార్యక్రమంలో నటుడు శర్వానంద్ కు క్రికెటర్ రోహిత్ శర్మ(Rohit Sharma) బయోపిక్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. శర్వానంద్ చూడ్డానికి కాస్త రోహిత్ శర్మ పోలికలతో ఉన్నారని ఈయన రోహిత్ శర్మ బయోపిక్ చేస్తే మంచి సక్సెస్ అవుతుంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

రోహిత్ శర్మ బయోపిక్.. శర్వా గ్రీన్ సిగ్నల్..

Advertisement

ఇలా రోహిత్ శర్మ బయోపిక్ సినిమా గురించి తాజాగా శర్వానంద్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే శర్వానంద్ ఈ బయోపిక్ సినిమా గురించి మాట్లాడుతూ.. రోహిత్ శర్మ లాగా ఉన్నానని చాలామంది ఇప్పటికే చెప్పిన విషయాన్ని ఈయన గుర్తు చేసుకున్నారు అలాగే రోహిత్ శర్మ బయోపిక్ సినిమా చేద్దామంటూ ఎవరైనా తన వద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తానని శర్వానంద్ తెలియజేశారు. అదేవిధంగా రోహిత్ శర్మ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

భోగి పనులలో శర్వానంద్..

Advertisement

ఈ విధంగా శర్వానంద్ రోహిత శర్మ బయోపిక్ సినిమా గురించి స్పందించడంతో కథ సిద్ధమైతే ఈయన తప్పకుండా ఈ సినిమాలో నటిస్తారని స్పష్టమవుతుంది. మరి శర్వానంద్ సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ బయోపిక్ సినిమా కథతో ఎవరు ఆయనని అప్రోచ్ అవుతారో తెలియాల్సి ఉంది. పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈయన సంపత్ నంది దర్శకత్వంలో భోగి అనే సినిమాలో నటిస్తున్నారు అదేవిధంగా మరొక డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో కూడా శర్వానంద్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: Manchu Lakshmi: మంచు ఫ్యామిలీలో విబేధాలు.. ఒక్క పోస్టుతో రూమర్లకు చెక్ పెట్టిన మంచు లక్ష్మి!

Related News

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

ఎవరీ సాత్విక.. ఒక్క టీజర్ తోనే ఊహించని క్రేజ్!

కీర్తి సురేష్ పుట్టినరోజు స్పెషల్.. ‘అక్క’ టీజర్ రిలీజ్ !

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

Big Stories

Advertisement
×